ఈ మధ్య కాలంలో మనుసులను పట్టి పీడిస్తున్న సమస్యలలో ఒకటి డిప్రెషన్. అయితే చాలా మంది దీనిని చాలా చిన్న సమస్యగా మరికొందరు అసలు సమస్యనే కాదు అన్నట్లుగా భావిస్తారు. కానీ, డిప్రెషన్ నిలువెత్తు మనిషిని కూడా మానసికంగా మరియు శారీరకంగా కృంగదీసే ప్రమాదకరమైన సమస్య అనేది తెలుసుకోలేకపోతున్నారు. అంతేకాదు దీనికి వయసుతో సంబంధం లేకుండా ఏ వయస్సు వారైనా డిప్రెషన్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిని నిర్లక్ష్యం చేసే కొద్ది మంది ప్రాణాలే రిస్క్‌లో పడతాయి. దాని కోసమే వీలైనంత త్వరగా దీనిని వదిలించుకోవాలి. అంతేకాదు కొందరికి తాము డిప్రెషన్‌లో ఉన్నారనే విషయాన్నీ కూడా గ్రహించలేరు. అసలు ఇంతకీ డిప్రెషన్ లో ఉన్నారా..? లేదా..? అనేది తెలుసుకోవాలంటే కొన్ని కొన్ని లక్షణాల బట్టి కనుకోవచ్చు. మరి ఆ లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఒంటిరితనానికి ప్రాధాన్యత ఇస్తూ బయట వ్యక్తుల తోనే కాక ఫ్యామిలీ మెంబర్స్‌, ఫ్రెండ్స్‌తోనూ కలవకుండా, కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. అలాగే డిప్రెషన్ లో ఉన్నవారు  ఎప్పుడో జరిగిపోయిన విషయాలను గుర్తు చేసుకుంటూ  తరచూ బాధపడటమే కాకుండా  అనవసరమైన విషయాల్లో తెగ కంగారు పడుతూ, ఇష్టమైన వ్యక్తులు, ప్రదేశాలు, ఆహారాలు మొదలగు వాటిపై ఆసక్తిని చూపెట్టరు.  అంతేకాదు ఆందోళన, తొందర పాటు, విసుగు,  దూకుడు,  గుండెల్లో దడ, అసమర్థత, అలాగే ఉన్నట్టు ఉండి బరువు తగ్గడం, కోపం తెచ్చుకోవడం వంటివి కూడా డిప్రెషన్ లక్షణాలు. ఇంకా డిప్రెషన్ ఉన్న వారు అస్సలు పడుకోలేకపోవడం లేదా ఎప్పుడూ నిద్ర పోతూనే ఉంటారు.

అంతేకాదు అసలు  పనిపైన అంతగా ఆసక్తి చూపరు. అలాగే ప్రతి విషయాన్ని కూడా మరచిపోతుంటారు. ఇంకా చెప్పాలి అంటే డిప్రెషన్‌లో ఉన్న వారికి అసలు ఆకలి ఉండదు. ఒకవేళ వారికి ఆకలి ఉన్నా కూడా వేళకు భోజనం తీసుకోరు. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. కాబట్టి, పైన చెప్పిబడిన లక్షణాలు కనుక ఉన్నట్లు అనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మంచి మానసిక వైద్యుడిని సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే  మంచిది. అలాగా చేయలేదంటే డిప్రెషన్‌లో కూరుకుపోవడంతో పాటు ఒక్కోసారి ప్రాణాలను తీసుకునే స్టేజ్ వరకు వెళ్లే ప్రమాదం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: