అసలే వర్షాకాలం.. పైగా వానలు ఎక్కువ..ఎండ తక్కువ. ఇక బట్టలు ఉతికినా సరే ఎండ రాక బట్టల నుంచి తేమ పోక అదొక రకమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇక ఈ వర్షాకాలంలో మీరు మీ దుస్తులను పూర్తిగా తాజాగా,  ఇన్ఫెక్షన్లు లేకుండా చేసుకోవాలి అంటే కొన్ని రకాల ఉపాయాలను అనుసరించడం తప్పనిసరి. ఇకపోతే వర్షాకాలంలో తడి బట్టలు ఆరబెట్టడం అనేది మహిళలకు పెద్ద సవాలుగా మారింది. ఇక తడి బట్టలు వర్షంలో తడిస్తే మరింత దుర్వాసనకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా వాటి నుండి మురికి వాసన రావడం మొదలవుతుంది. వదిలించుకోవడం కూడా అసాధ్యమని చెప్పవచ్చు. ఇక అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి తడి బట్టలను మీరు వేసుకుంటే చర్మానికి ఇన్ఫెక్షన్ వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది.


ఇక ఇలా వర్షాకాలంలో కూడా దుస్తులు పూర్తిగా తాజాగా,  ఇన్ఫెక్షన్ లేకుండా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ట్రిక్స్ ఏంటో మనం చదివి తెలుసుకుందాం..


వంట సోడా, వెనిగర్..
వర్షాకాలంలో బట్టలు ఉతికిన తర్వాత కూడా దుర్వాసన వస్తూ ఉంటే బట్టలు ఉతికేటప్పుడు లాండ్రీ పౌడర్లో కొద్దిగా బేకింగ్ పౌడర్ లేదా వెనిగర్ ను నీటిలో కలిపి బట్టలు ఉతకండి. ఇలా చేస్తే వర్షం వల్ల వచ్చే దుర్వాసన బట్ట లకు అంటుకోదు.


నిమ్మరసం:
ఇక వర్షాకాలంలో బట్టలు సరిగా ఆరవు కాబట్టి తేమ అలాగే ఉంటుంది. ఇక ఈ బట్టలు ఆరడానికి ఎక్కువ సమయం కావాలి. మరి అదే సమయంలో బట్టల నుండి దుర్వాసన రావడం మొదలవుతుంది. ఇక బట్టలు ఉతుకుతున్నప్పుడే అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి బట్టలు ఉతికితే ఎటువంటి దుర్వాసనైనా సరే ఇట్టే దూరం అవుతుంది.


దుస్తులను ఎప్పుడూ కూడా ఒకేచోట ఉంచవద్దు.. ముఖ్యంగా తడి బట్టలను,  పొడి బట్టలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిపి ఉంచకూడదు. ఇలా చేస్తే అన్ని బట్టలు కూడా దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: