అంతేకాదు రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. ప్రస్తుతం వానలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో చాలామంది దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులకు తరచూ గురి అవుతున్నారు. అలాంటప్పుడు వేడిపాలలో కొంచెం వాముపొడి కలుపుకొని తాగితే మంచి ఉపశమనం కూడా కలుగుతుంది. అంతేకాదు తలనొప్పి కూడా ఇట్టే తగ్గిపోతుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు వాములో ఉండే విటమిన్ సి మన శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇక వాములో ఉండే ఎన్నో పోషకాలు గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. కాబట్టి రోజు వారి ఆహారంలో వామును చేర్చుకుంటే మంచిదని నిపుణులు సైతం సూచిస్తున్నారు.
ఇకపోతే వామును పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవాలి. వాము పొడిలో నీటిని కలిపి పేస్ట్ గా చేసి కీళ్ల నొప్పులు, మోకాల నొప్పులు ఉన్న ప్రదేశంలో మర్దన చేస్తే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మైగ్రేన్ తలనొప్పి, జలుబు వంటి వాటికీ మంచి మెడిసిన్ అని చెప్పవచ్చు. ఇకపోతే వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తూ ఉంటే జలుబు , తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా వేడి నీటిలో వామును కలుపుకొని తాగడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యలు, వాంతులు వంటివి కూడా దూరం అవుతాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి