బరువు తగ్గించుకునే క్రమంలో ఈ తప్పులు చేయకండి?

ప్రతి ఒక్కరూ కూడా తమ బరువును నియంత్రించుకోవడానికి ఏవేవో చర్యలు తీసుకుంటారు. పెరిగిన బరువును నియంత్రించుకోవడానికి, లేదా అదే బరువును మెయింటైన్ చేయడానికి చాలామంది పలు రకాల వ్యాయామాలు చేస్తారు. అంతేకాకుండా అనేక రకాల డైట్లు కూడా అనుసరిస్తారు. ఇలాంటి సమయంలో కొన్ని తప్పులు చేయడం వల్ల శరీర బరువు తగ్గడానికి బదులు పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక చాలామంది ఆందోళన చెందుతుంటారు. దీనికి ప్రధాన కారణం బరువు తగ్గే సమయంలో చేసే కొన్ని తప్పులేనని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. దాని వల్ల బరువు తగ్గడానికి బదులు పెరగడం మొదలవుతుందని పేర్కొంటున్నారు. కావున బరువు తగ్గే సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు.ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మీ శరీరం లైపేస్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అందుకే ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోకుండా కాసేపు అటుఇటు నడవండి. ఆఫీసులో గంటల తరబడి కూర్చొకుండా.. అప్పుడప్పుడు కూర్చిలో నుంచి లేచి నడుస్తుండాలి.


ఆహారం తక్కువ తినడం వల్ల బరువు తగ్గుతుందని మీరు అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే పూర్తిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల మలబద్ధకం లాంటి సమస్యలు పెరుగుతాయి. మీ బరువు తగ్గడానికి బదులుగా పెరుగుతుంది. మరోవైపు తక్కువ ఆహారం తీసుకున్నప్పుడు.. మెదడు ఇబ్బందుల్లో ఉన్నామని గ్రహిస్తుంది. దీంతో శారీరక ప్రక్రియలు నెమ్మదిస్తాయి. దీంతో బరువు పెరగడం ప్రారంభమవుతుంది.బరువు తగ్గించే ప్రయాణంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. మీరు రోజూ 6 నుంచి 8 గంటలు నిద్రపోకపోతే అది బరువుపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే 8 గంటలు నిద్రపోయేవారిలో జీవక్రియ చురుకుగా ఉంటుంది. అలాంటి వారి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కావున మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే ఖచ్చితంగా 8 గంటలపాటు నిద్ర పోవాలని సూచిస్తున్నారు.బరువు తగ్గించుకునే క్రమంలో ఈ తప్పులు చేయకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: