డ్రై ఫ్రూట్స్ వల్ల ఆరోగ్యానికి మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.  వీటిలో ముఖ్యంగా జీడిపప్పు ఒకటిని చెప్పవచ్చు.  ఇది తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. అంతే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ ఉంటుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల మన శరీరానికి అనవసరమైన కొవ్వు పెరిగిపోతుంది.. తద్వారా గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని ఎక్కువమంది భయపడుతూ ఉంటారు. అయితే ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి పెంపొందించేలా చేస్తుంది. ఇక ఇతర అవయవాల పనితీరు మెరుగుపరిచేలా చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చర్మం కాంతివంతంగా మారేందుకు.. పురుషుల వీర్య కణాల అభివృద్ధికి కూడా జీడిపప్పు చాలా ఉపయోగపడుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు.

వేరుశెనగ బాదంపప్పులో ఉన్న విధంగానే ఇందులో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి.  ముఖ్యంగా గర్భిణీలు తమ డైట్లో ఇలాంటి వాటిని చేర్చుకోవడం వల్ల పలు లాభాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా విటమిన్స్..A,E,K, మెగ్నీషియం,  జింక్ వంటి ఖనిజాలు ఉన్నాయి. జీడిపప్పులో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు,  ఫ్యాటీ యాసిడ్స్ వంటివి రక్త కణాలను చాలా బలంగా తయారయ్యేలా చేస్తాయి. ముఖ్యంగా కొలెస్ట్రాలను తగ్గించి బీపీని కంట్రోల్ లో ఉంచేలా చేస్తాయి.అయితే మోతాదుకు మించి తీసుకున్నట్లు అయితే ఇది మన శరీరంలో కొవ్వు పేరుకుపోయి చాలా ప్రమాదాన్ని గురయ్యేలా చేస్తూ ఉంటుంది.

ముఖ్యంగా జీడిపప్పులో పొటాషియం,  మెగ్నీషియం వంటివి ఉంటాయి.  ఇవి రక్తంలో కలిసి చక్కెర స్థాయిని అదుపులో ఉంచేలా చేస్తుంది. ముఖ్యంగా ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.  కాబట్టి షుగర్ పేషెంట్లు వీటి ని తరచూ తినడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇన్స్పెక్షన్ బారి నుండి కూడా శరీరాన్ని రక్షించడమే కాకుండా కండరాలకు అవసరమైన బలాన్ని కూడా అందించడంలో చాలా సహాయపడుతుంది ఈ జీడిపప్పు.

మరింత సమాచారం తెలుసుకోండి: