చల్లటి నీటిని తాగడం వలన శరీరం పైన ప్రభావం చూపిస్తుంది. చల్లని నీటిని ఎక్కువగా తాగడం వల్ల శ్వాస తీసుకోవడం చాలా కష్టతరంగా ఉంటుందట. ముఖ్యంగా సూప్ లు, వేడినీరు అంటివి తాగడం శ్వాస తీర్చుకోవడానికి చాలా సహాయపడతాయి. అలాంటి సమయంలో మనం చల్లని నీటిని తాగినప్పుడు శ్వాస తీసుకోవడం చాలా కష్టతరంగా ఉంటుందట. చల్లటి నీటిని తాగడం వల్ల ఆరోగ్య పరిస్థితులు చాలా తారుమారవుతాయి. చల్లటి నీటిని తరచు తాగడం వల్ల మైగ్రీన్ సమస్యకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది.
చల్లని నీరు జీర్ణ క్రియ సమయంలో పోషకాలను గ్రహించి సహజ ప్రక్రియను కూడా నిరోధిస్తుంది. అంతేకాకుండా ముక్కు కారడం గొంతు నొప్పి వంటి సమస్యలు కూడా అధికంగా వస్తాయట. భోజనం చేసిన తర్వాత ఎవరైనా సరే చల్లని నీటిని తాగరాదు. ఇలా చేయడం వల్ల కడుపునొప్పి విరోచనాలు కూడా దారితీస్తాయని వైద్యులు తెలియజేస్తున్నారు. ఎవరైనా సన్నబడాలని చూస్తే కచ్చితంగా భోజనం చేసిన తర్వాత చల్లని నీటిని తాగేయడం మానేయాలి చల్లని నీటిలో ఎక్కువగా టాన్సిల్ సమస్యలను కలిగించేలా చేస్తుందట.
అయితే కొంతమంది పరిశోధనలు చేసిన ప్రకారం వ్యాయామం చేసే సమయంలో చల్లని నీటిని తాగడం వల్ల శరీరం చాలా వేడెక్కుతుందట. వ్యాయామాలు మరియు ఉత్సాహంగా కూడా కొనసాగేందుకు అవకాశం ఉంటుందని తెలియజేయడం జరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి