ఈ సృష్టిలో వున్న ప్రతి జీవికి కూడా నీరు చాలా అవసరం. ఎందుకంటే నీరు లేకపోతే భూమిపై ఉండే ఏ జీవి కూడా మనుగడ సాధించలేదు.ఆహారం లేకున్నా కూడా కొన్ని రోజులు బతకగలం కానీ నీరు లేనిది అస్సలు ఒక్క పూట కూడా జీవించలేని పరిస్థితి. నీరు  అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. రోజుకు కనీసం 3 లీటర్లు నీరు తాగాలని డాక్టర్లు చెబుతంటారు. నీటిని ఎంత ఎక్కువగా తాగితే అంత ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది భోజనం చేసే సమయంలో మధ్య మధ్యలో ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు. కొంతమంది భోజనం చేయడానికి ముందు మంచి నీరు ఎక్కువగా తాగుతారు. అయితే ఇలా మధ్య మధ్యలో నీళ్లు తాగడం మంచిదేనా అనే విషయంపై ఆరోగ్య నిపుణులు కొన్ని ఆసక్తికర విషయాలను చెబుతున్నారు.భోజనం మధ్యలో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఆహారం జీర్ణం అవడం కష్టం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల టాక్సిన్స్ పేరుకుపోతుందని, ఆయుర్వేదం  కూడా భోజనం మధ్యలో నీళ్లు తాగొద్దనే విషయాన్నే చెబుతోందని వివరిస్తున్నారు. భోజనంతో పాటు నీటిని తాగడం వల్ల ప్రొటీన్లు, విటమిన్లు ఇంకా పోషకాలను జీర్ణం చేసుకోవడం ఆలస్యం అవుతుందని, ఇది జీర్ణక్రియ సక్రమంగా సాగేందుకు ఆటంకం కలిగిస్తుందని చెబుతున్నారు.


భోజనం చేసే సమయంలో ఎలాంటి నీటిని తాగుతున్నారనే విషయం పట్ల కూడా ఖచ్చితంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్కలిన్ వాటర్ పొట్టలోని ఆమ్లాలు ఎక్కువగా పెంచుతాయి. భోజనం చేసిన తర్వాత నీళ్లు తీసుకోవడం అనేది ఒంటి తీరుపై ఆధారపడి ఉంటుంది. అవసరం లేదనుకుంటే అన్నం తిన్న కొద్దిసేపటి తర్వాత నీళ్లు తాగడమే చాలా మంచిది. అయితే.. భోజనం మధ్యలో నీరు తాగకుండా ఉండటమే మంచిది అనే విషయాన్ని నిరూపించేందుకు సైంటిఫిక్ గా ఎటువంటి అధ్యయనాలు లేవని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారు.అయితే.. స్నానానికి ముందు ఒక గ్లాస్ వాటర్ తాగడం వల్ల రక్త పోటు అదుపులో ఉండటమే కాకుండా కంట్రోల్ లో కూడా ఉంటుంది. కొంత మందికి వేడి నీటితో స్నానం చేసిన తర్వాత నీళ్లు తాగాలని ఎక్కువగా అనిపిస్తుంది. ఇక జీర్ణక్రియకు సహాయపడటానికి భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాసు నీరు తాగాలి. అయితే ఎక్కువ  నీటిని మాత్రం తాగవద్దు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల జీర్ణ రసాలు పలచన అవుతాయి. ఆహారం తీసుకున్న ఒక గంట తర్వాత నీటిని తాగితే చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: