తాజా తాటికల్లు : తాటికల్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.ఉదయాన్నే పరగడుపున తాటి కల్లును లేదా ఈత కల్లును తాగడం వల్ల ఖచ్చితంగా మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తాటి కల్లును తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలన్నీ కూడా ఈజీగా బయటకు పోయి శరీరం లోపల బాగా శుభ్రపడుతుంది. అయితే పులిసిన లేదా పుల్లగా మారిన తాటికల్లును మాత్రం అస్సలు తాగకండి. దీన్ని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చెట్టు నుండి తీసిన తాటికల్లును ఒక గంట నుండి లోపే తాగాలి. ఎందుకంటే అలా తాగక పోతే అందులో బ్యాక్టీరియా వృద్ధి చెంది అనారోగ్యానికి కారణమవుతుందట. స్వచ్ఛమైన, తాజా తాటికల్లును తాగినప్పుడే మనం ఖచ్చితంగా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


చెట్టు నుండి తాజాగా తీసిన స్వచ్ఛమైన తాటి కల్లులో మన శరీరానికి మేలు చేసే మొత్తం 18 రకాల సూక్ష్మ క్రిములు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. తాటి కల్లులో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయని దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.తాటి కల్లులో మొత్తం 53 రకాల సూక్ష్మ క్రిములు ఉన్నాయి.వాటిలో 18 రకాల సూక్ష్మ క్రిములు మన శరీరంలో ఉన్న వ్యాధి కారక క్రిములను చంపుతాయని నిపుణులు గుర్తించారు. తాటికల్లులో ఉండే చఖరో మైసెస్ అనే సూక్ష్మ జీవికి మనిషి కడుపులో క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే ఒబిఎస్ 2 అనే క్యాన్సర్ కారక కణాలను చంపే గుణం ఉందని కనుగొన్నరు. తాటికల్లును తాగడం వల్ల డయేరియా ఇంకా అలాగే టైఫాయిడ్ వంటి అనారోగ్య సమస్యలు తగ్గు ముఖం పడతాయి.కాబట్టి ఖచ్చితంగా కూడా తాటి కల్లు తాగండి. ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: