మన ఇంట్లో వ్యక్తి కూడా తన పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి లేదా ఖాళీ సమయాన్ని ప్రశాంతంగా గడపడం కోసం చాలా ఎక్కువగా టీవీలను చూస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే గంటల తరబడి టీవీలకు తెగ అతుక్కుపోతుంటారు.చాలా ఎక్కువ సేపు టీవీ స్క్రీన్ లకే వారు అతుక్కుపోతుంటారు. ప్రతి రోజు ఇలా గంటల తరబడి వారు టీవి చూస్తుంటారు. అయితే టీవీ ముందు ఎక్కువ సమయం గడిపేవారికి గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతిరోజూ కూడా ఒక గంట కంటే తక్కువ సమయం టీవీ చూడటం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని 11 శాతం దాకా తగ్గించవచ్చని తేల్చింది. మఖ్యంగా చిన్న పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో మొబైల్, టీవీ స్క్రీన్లకు చాలా ఎక్కువ సేపు పరిమితిమవుతున్నారు. దీంతో తక్కువ వయసులోనే వారికి కళ్ల జోళ్లు వాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎక్కవు సేపు టీవీ లేదా మరే ఇతర స్క్రీన్లకు అతుక్కుపోయినా కానీ ఖచ్చితంగా ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది.


అలాగే రోజుకు 4 గంటల కంటే ఎక్కువసేపు టీవీ చూసే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని వారు వెల్లడించారు. రోజుకు 2-3 గంటలు టీవీ చూసే వ్యక్తులలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఏకంగా 6 శాతం తక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనం కోసం నిర్వాహకులు 5లక్షల కంటే ఎక్కువ మంది వ్యక్తుల నుంచి పాలిజెనిక్ రిస్క్ స్కోర్‌లను సేకరించడం జరిగింది. శారీరకంగా చురుకుగా ఉండటానికి బదులుగా ఎక్కువసేపు కూర్చోవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా ఎక్కువగా పెంచుతుందని వారు చెబుతున్నారు.టీవీ చూడటం లేదా కంప్యూటర్‌ను వాడటం వల్ల చాలామంది ఒక దగ్గర గంటల తరబడి కూర్చుంటారు.దీనివల్ల గుండె పనితీరు ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించడం జరిగింది. నిజానికి కదలకుండా ఒకే దగ్గర కూర్చొని పనిచేయడం శరీరానికి అస్సలు మంచిది కాదు.కనీసం అర్దగంటకి ఒకసారైనా శరీరంలో ఖచ్చితంగా కదలికలు ఉండాలి. లేదంటే ఖచ్చితంగా ధీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: