ఈ మధ్య కాలంలో కిడ్నీలోని రాళ్లతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అవి కరిగించుకోవడానికి ఎన్నెన్నో ఇంగ్లిష్ మందులు వాడి అవి తగ్గక చాలా బాధపడితున్నారు. కిడ్నీలోని రాళ్లను కరిగించికోవడానికి ఆయుర్వేదంలో మంచి ఫలితాలను అందించే ఎన్నో ఔషదాలు ఎన్నో ఉన్నాయి.మన పూర్వీకుల ఆయుర్వేద చికిత్సలను అనుసరించి నిదానంగా అయినా మంచి ఫలితాలు పొందారు. ఇందులో భాగంగా కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడం కోసం కొండపిండి ఆకును వినియోగించేవారు.

 
ఈ ఆకు పేరులో ఉన్నట్టుగానే గులక రాళ్లను సైతం పిండి చేసే గుణాన్ని కలిగివుంటుంది.అంతేకాక కిడ్నీల పనితీరు మెరుగుపరుస్తుంది.ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలెన్నో పుష్కలంగా లభిస్తాయి.
 
ఉదయం లేవగానే ఆహారం ఏమీ తీసుకోకుండా పరిగడుపున గుప్పెడు కొండపిండి ఆకును తీసుకొని, దానిని బాగా దంచుకొని లేదా మిక్సిలో వేసి రసం తీయాలి.అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర, 3స్ఫూన్ ల పటికబెల్లం పొడిని కలిపి చిక్కటి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. దీనిని క్రమం తప్పకుండ వారం రోజుల పాటు త్రాగితే రాళ్లు కరిగి పోవడం లేక రాళ్లు మూత్రంతో పాటు పడిపోవడం కానీ జరుగుతుంది.

 
అంతకన్న ఎక్కువ రోజులు త్రాగిన కలిగే నష్టమేమి కలగదు. ఈ ఔషదాన్ని చాలామంది నమ్మరు కానీ,ఇది ఆయుర్వేద చికిత్సలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంగ్లిష్ మందులులాగా ఎటువంటి దుషప్రభావాలు కలగవు.ఈ రసంతో యూరిక్ యాసిడ్ తో కూడిన రాళ్లు పడిపోవడం కానీ కరిగిపోవడం కానీ జరుగుతుంది. దీనిని కొండపిండిఆకును కూరగా కానీ,కషాయంలా తీసుకున్న మంచి ఫలితాల ను ఇస్తుంది.

దీనితో పాటు కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అలవార్చుకోవాలి.
1).మాంసపుకృతులు ఎక్కువగా వున్న మాంసం, ధాన్యాలు, బీన్స్, మెంతి కూర, బిట్ రూట్ మొదలైన ఆహారాలకు దూరంగా ఉండాలి.
2).మందు లేదా బీర్ తాగే అలవాటు ఉంటే మానుకోవడం మంచిది.
3).రోజూ 30 నిముషాల పాటు నడక , వ్యాయామం , యోగా వంటివి అలవాటు చేసుకోవడం వల్ల శరీర అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: