కీళ్ళ నొప్పుల నివారణకు సూపర్ టిప్స్?


ప్రస్తుతం కొంతమంది చేస్తున్న ఉద్యోగాలనేవి కూర్చొని పని చేసేవి. వారు కదలకుండా ఒకేచోట కూర్చుని ఉన్న పరిస్థితులు అనేవి యుక్తవయస్కుల్లో కూడా కీళ్ల సమస్యకు ప్రధాన కారణం గా మారుతున్నాయి. ఏదైనా గాయం వల్ల లేదా శరీరంలో పోషకాహారలోపం వల్ల కూడా ఈ కీళ్ల నొప్పులు అనేవి ఎక్కువగా రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. మన దేశంలో అయితే దాదాపు 180 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు.ఈ నొప్పులు తగ్గడానికి అవకాశం ఉన్న ఉన్నంత వరకూ కూడా పెయిన్ కిల్లర్స్ శరీరంలోపలికి తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈమధ్య కాలంలో బయోలాజికల్ ఇంజెక్షన్లు ఎక్కువగా వాడుతున్నారు. కీళ్లు వంగకుండా ఉండేందుకు ఇది మంచి అధునాతన చికిత్స. అయితే రోగ నిర్ధారణ జరిగిన 6 నెలల్లోపు చికిత్స చేయాల్సి ఉంటుంది.అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. 


వీటిలో ల్యూకోట్రైన్స్ అని పిలువబడే ఇన్ఫ్లమేటరీ అణువులను అణిచివేసేందుకు, ఇంకా అలాగే నొప్పి వాపునకు కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్‌లను సంశ్లేషణ చేసే సామర్థ్యం కూడా ఉంటుంది.ఇంకా అలాగే వెల్లుల్లిలో డయాలిల్ డైసల్ఫైడ్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనం అనేది ఉంటుంది. ఇది ప్రో-ఇన్‌ఫ్లమేటరీ సైటోకిన్‌ల ప్రభావాలను చాలా ఈజీగా తగ్గిస్తుంది.కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ జెల్‌ లో ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడే ఆంత్రాక్వినోన్స్‌ కూడా ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీకు ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.అలాగే పసుపులోని ప్రధాన పదార్థం కర్కుమిన్, ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.ఇది కీళ్ల వాపు నుంచి ఉపశమనానికి మీకు ఉపకరిస్తుంది.ఇంకా అలాగే థైమ్ ఆకులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులకు చాలా మంచి మందుగా ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: