మనం పుచ్చకాయను చాలా ఇష్టంగా తింటూ ఉంటాము.పుచ్చకాయ చాలా రుచిగా ఉంటుంది. ఇందులో మన శరీరానికి అవసరమయ్యే చాలా రకాల పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని తినడం వల్ల మనం ఖచ్చితంగా చాలా ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.వేసవికాలంలో పుచ్చకాయను తినడం వల్ల మన శరీరం చల్లగా మారుతుంది. మన శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది.ఇది కేవలం మన ఆరోగ్యానికే కాదు మన అందానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇది చర్మంపై ఉండే నలుపును ఈజీగా తొలగించి ముఖాన్ని అందంగా అలాగే మృదువుగా మార్చడంలో పుచ్చకాయ చాలా బాగా సహాయపడుతుంది. అయితే పుచ్చకాయను ఏ విధంగా వాడటం వల్ల మనం మన ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.అందుకోసం ముందుగా ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల పుచ్చకాయ జ్యూస్ ను తీసుకోవాలి.


ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ శనగపిండి వేసి కలపాలి. తరువాత ఒక టీ స్పూన్ నిమ్మరసంని వేసి బాగా కలపాలి. పొడి చర్మం, సున్నిత చర్మం ఉన్న వారు ఇందులో నిమ్మరసానికి బదులు పెరుగును వేసుకోని కలపవచ్చు. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వాడే ముందు రోజ్ వాటర్ లో దూదిని ముంచి ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి బాగా రాసుకోవాలి. తరువాత 3 నిమిషాల పాటు సాఫ్ట్ గా మసాజ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత దీనిపై ఇదే మిశ్రమాన్ని మళ్ళీ రాసుకోవాలి.ఇక ఇలా రెండోసారి రాసుకున్న మిశ్రమం కూడా ఆరిన తరువాత నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం ఉండే నలుపు ఇంకా అలాగే మృతకణాలు అన్ని కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి. అలాగే ముఖం చాలా అందంగా ఇంకా కాంతివంతంగా తయారవుతుంది.ఈ టిప్ ని వారానికి రెండు నుండి మూడు సార్లు వాడడం వల్ల మనం మన సౌందర్యాన్ని చాలా సులభంగా పెంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: