ఈమధ్యకాలంలో రకరకాల ఆరోగ్య సమస్యలు, ఆహారపు అలవాట్లు కారణంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతోంది .చాలామంది ఆ కొవ్వును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజనం కలగక,తెగ ఇబ్బంది పడుతూవుంటారు. అలాంటి వారు ప్రకృతిలో లభించే కొన్ని రకాల పూలలో ఉన్న ఔషధ గుణాలు ద్వారా బెల్లీ ప్యాట్ ను తొందరగా కరిగించుకోవచ్చు అని ఆహారనిపుణులు సూచిస్తుంన్నారు.అవేంటో ఇప్పుడు చూద్దాం..

మల్లెపువ్వుల టీ..

వేసవిలో విరివిగా దొరికే మల్లెపువ్వులు సువాసన వెదజల్లడమే కాక,బెల్లి ఫ్యాట్ ను తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి.దీనికోసం ఒక గిన్నెలో గ్లాసు నీళ్లు,గుప్పెడు మల్లెపువ్వులు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీరు గోరువెచ్చగా అయిన తర్వాత, అందులో ఒక స్పూన్ తేనె,ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల,బెల్లీప్యాట్ ని తొందరగా కరిగించుకోవచ్చు.ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా చాలా బాగా సహాయపడతాయి.

మందారంపూల టీ..

మందార పూలటి తరచూ తీసుకోవడం వల్ల,అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ గుణాలు పొట్ట చుట్టూ పేరుకుపోయిన చెడుకొలెస్ట్రాల్ ని తొందరగా తగ్గించడంలో ఉపయోగపడుతుంది.అంతే కాక సీజనల్గా వచ్చే దగ్గు,జలుబుకు తొందరగా ఉపశమనం కలిగిస్తుంది.మరియు ఇందులోని బీటా కెరోటీన్ గుణాలు జుట్టు మరియు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

గులాబీపూల టీ..

గులాబీపువ్వుల టీ ను తరచూ తీసుకోవడంతో, అందులోని L- తీయానైన్ అమైనోఆసిడ్ మెదడులోని ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.మరియు ఇందులోని మెగ్నీషియం,పొటాషియం,ఫైబర్ గుణాలు పొట్టచుట్టూ పేరుకుపోయిన కొలెస్ట్రాలను కరిగించి పొట్ట కండరాలను దృఢంగా తయారుచేస్తాయి.

అపరంజిత పూలటీ..

అపరంజిత పూల టీను తరచూ తీసుకోవడంతో,మనసులోని యాంగ్జైటీఫీలింగ్ తగ్గించుకోవచ్చు.మరియు ఇందులోనే విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది.మరియు చెడుకొలెస్ట్రాల్ను కరిగించడానికి కూడా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా చర్మ సమస్యలు దరిచేరకుండా సహాయపడుతుంది.

మ్యారీ గోల్డ్ టీ..

మ్యారిగోల్డ్ పూలతో తయారు చేసుకునే టీ మెల్లగా తీసుకోవడం వల్ల,ఎంతటి తలనొప్పినైనా ఇట్టే తగ్గిస్తుంది.మరియు పొట్టక్యాన్సర్లను,పొట్టచుట్టూ పెరుగుపోయిన చెడుకొలెస్ట్రాల్ కరిగించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: