టమాటాలతో మనం ఎన్నో రకాల వంటకాలు చేసుకొని తింటూ ఉంటాము. వీటితో వండిన వంటకాలను చాలా ఇష్టంగా తింటామనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం టమాటాల రేట్లు కూడా ఒక రేంజ్ లో మండిపోతున్నాయి. కిలో టమాటాలను కొనుగోలు చేయాలంటే ఏకంగా 100 రూపాయల నుంచి 150 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది.ఈ టమాటాలను కొనే, తినే పరిస్థితులు లేవని చాలా మంది నుంచి మాటలు వినిపిస్తున్నాయి.టమాటాల ధరలు తగ్గాలంటే ఇంకా మరో నెలరోజులు ఎదురుచూపులు తప్పవని చెప్పవచ్చు.అయితే టమాటాలతో చేసిన వంటకాలను తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే మరీ ఎక్కువగా టమాటాలతో చేసిన వంటకాలను తినడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. టమాటాలతో చేసిన వంటకాలను ఎక్కువగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్యకు టమాటా కొన్ని సందర్భాల్లో కారణమయ్యే ఛాన్స్ ఉంటుందట.కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు టమాటాలను తీసుకుంటే ఆరోగ్యానికి ఖచ్చితంగా చాలా నష్టం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ టమాటాలలో అధిక మొత్తంలో ఉండే ఆక్సలేట్ వల్ల ఈ భయంకర సమస్య వచ్చే అవకాశం ఉంటుందట.ఈ టమాటాలను ఎక్కువగా తినేవాళ్లలో కాల్షియం ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అలాగే కిడ్నీలు ఈ కాల్షియంను తొలగించడం కూడా అంత సులువు కాదు.అందువల్ల కిడ్నీలలో రాళ్ల రూపంలో కాల్షియం పేరుకుని పోయే అవకాశం ఉంటుంది. కిడ్నీల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కిడ్నీల విషయంలో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే వైద్యులను సంప్రదించి ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.కాబట్టి ఏమి తిన్నా కూడా అతిగా కాకుండా మితంగా తింటే సంపూర్ణ ఆరోగ్యంగా ఎలాంటి రోగాలు రాకుండా వుంటారు. కాబట్టి ఏదైనా మితంగా తినండి. ఆరోగ్యంగా ఉండండి.
మరింత సమాచారం తెలుసుకోండి: