పొట్టలో నులిపురుగులు ఉండడం వల్ల ఖచ్చితంగా చాలా రోగాలు వస్తాయి. కడుపు నొప్పి బాగా వస్తుంది. ఇంకా అలాగే కడుపులో అసౌకర్యంగా ఉండడం, తిన్న ఆహారం వంటికి పట్టకపోవడం ఇంకా రక్తహీనత వంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. మన శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం, అపరిశుభ్రమైన వాతావరణంలో ఉండడం, అలాగే కలుషితమైన నీరు, ఆహారాన్ని తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం వంటి వివిధ కారణాల చేత ప్రేగుల్లో ఈ నులిపురుగులు తయారవుతాయి. సాధ్యమైనంత త్వరగా ప్రేగుల్లో ఉండే నులిపురుగులను తొలగించే ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి.లేదంటే మనం ఖచ్చితంగా తీవ్ర అస్వస్థకు గురి కావాల్సి వస్తుంది. అయితే నులిపురుగులను నివారించే మందులు మనకు మార్కెట్ లో ఎక్కువగా లభిస్తాయి. అయితే మందులు వాడకుండా సహజ సిద్దంగా కూడా మనం ఈ నులిపురుగులను తొలగించుకోవచ్చు. ఇందు కోసం మనం ఎనీమా చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ నీటితో చేసుకోదగిన ఎనీమా కిట్స్ మనకు మెడికల్ షాపుల్లో దొరుకుతూ ఉంటాయి.


మనం ఉదయం పూట కడుపు ఖాళీగా ఉన్న సమయంలో ఎనీమా బాటిల్ గోరు వెచ్చని నీటిని పోసి బాటిల్ ను ఎత్తులో ఉంచాలి. ఆ పైపులో ఉండే గాలి అంతా పోయి నీరు చేరిన తరువాత దానికి ఉండే నాజిల్ ను మలద్వారంలో ఉంచి పక్కకు తిరిగి మీరు పడుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ నీరంతా కూడా మలద్వారంలోకి ప్రవేశిస్తుంది.ఇలా చేసిన ఒక 10 నుండి 15 నిమిషాల్లో ప్రేగుల్లో ఉండే మలం అంతా ఈజీగా తొలగిపోయి మలద్వారం శుభ్రపడుతుంది. ఇలా ఒక రెండు రోజుల పాటు చేసుకున్న తరువాత మూడో రోజు వేపాకుల నీటితో ఎనీమా చేసుకోవాలి. ఇందుకోసం ఒక లీటర్ నీటిలో గుప్పెడు వేపాకులను వేసి వాటిని బాగా మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి అందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి.ఇక ఈ నీరు గోరు వెచ్చగా అయిన తరువాత వీటిని ఎనీమా డబ్బాలో పోసుకుని ఎనీమా చేసుకోవాలి. ఇలా మూడు రోజుల పాటు చేసుకోవడం వల్ల ప్రేగులు శుభ్రపడడంతో పాటు ప్రేగుల్లో ఉండే మలం కూడా చాలా ఈజీగా తొలగిపోతుంది. ఇంకా అలాగే ప్రేగుల్లో ఉండే నులిపురుగులతో పాటు ఇతర రకాల పాములు కూడా ఈజీగా తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: