పూర్వం నుంచే చెట్లను పెంచడం అనేది ఆనందంతో కూడుకున్న పనేకాక,అదృష్టంను తెస్తుంది కూడా.చెట్లను మన ఇంట్లో పెంచుకోవడం వల్ల,ఉదయం లేవగానే ఆ పచ్చదనం,మంచి గాలి వల్ల మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది.అలా అని ఏవి పడితే ఆ మొక్కలను అస్సలు పెంచుకోకూడదు.కొన్ని రకాల మొక్కలు మన ఇంటికి అదృష్టాన్ని ఆహ్వానిస్తే,కొన్ని రకాల మొక్కలు దురదృష్టాన్ని మోసుకువస్తాయి.కావున మనం వాస్తు రీత్యా ఎలాంటి మొక్కలను పెంచుకోవడానికి ప్రాముఖ్యత వుందో,అలాంటి మొక్కలనే పెంచుకోవాలని చెబుతున్నారు వేద పండితులు.మరి అవేంటో తెలుసుకుందామా..

తులసి చెట్టు..

తులసి చెట్టుకు హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన స్థానం ఉంది.ఈ చెట్టును మన పెరట్లో పెంచుకోవడంతో మంచి ఆరోగ్యం,సంపదను తీసుకోస్తుంది.పురాణాల ప్రకారం తులసి దేవిని వృందా దేవి అని కూడా పిలుస్తారు.


వేప చెట్టు..

వేప మొక్కను పెరట్లో పెంచుకోవడం వల్ల సానుకూల శక్తిని పెంచుతుంది.అంతేకాక ఈ చెట్టు ఎన్నో ఔషద గుణాలు కలిగివుంటుంది.ఆయుర్వేద చికిత్సలో వ్యాధులను నయం చేయడానికి ప్రసిద్ధి చెందింది.వాస్తు శాస్త్రం ప్రకారం ముఖ్యంగా ఇంటి వాయువ్య దిశలో వేప మొక్కను నాటాలి.లేకుంటే నెగటివ్ ఎనర్జీ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది.


లావెండర్ మొక్క..

లావెండర్ లేదా నీలిమ కనకంబరాలు ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు.దాని నుండి వచ్చే సువాసన మెదడులోని ఒత్తిడిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.అంతేకాక ఈ మొక్క వాస్తు ప్రకారం పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. మరియు శరీర ఆరోగ్యపరంగా దెబ్బతిన్న నరాలకు సైతం ఉపశమనాన్నికలిగిస్తుంది.

స్నేక్ ప్లాంట్..

స్నేక్ ప్లాంట్ ఇంట్లో గుమ్మం ఎదురుగా పెట్టుకోవడంతో పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది.అంతేకాక ఆక్సిజన్ ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది.గాలి ఎక్కువగా వచ్చే ప్రదేశంలో ఉంచితే ఆ రూమ్ అంతా ప్రశాంత వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది.

మనీ ప్లాంట్..

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకి ఉన్నంత ప్రాధాన్యత మనీ ప్లాంట్ కూడా ఉంది.ఈ మొక్కను లక్ష్మిదేవికి ప్రతిరూపంగా భావిస్తారు.ఈ మొక్క పెరిగే కొద్దీ , ఆ ఇంట్లోకి విజయాన్ని, సంపదను ఆకర్షిస్తుందని నమ్ముతారు. ఇది కుటుంబ ఆర్థిక సమస్యలను తగ్గిస్తుందని కూడా చాలామంది నమ్మకం.కానీ ఈ మొక్కను పెంచేటప్పుడు, కచ్చితంగా దానిని ఆగ్నేయం వైపు ఉంచుకోవాలి.అలాగే ఈ మొక్కను ఎవరికీ దానంగా లేదా గిప్ట్ గా అస్సలు ఇవ్వకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: