అయితే తాజాగా కొన్ని నివేదికలో ప్రకారం ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్ లో ఉపయోగించే పేపర్ ఉపరితల పూతతో ఉన్న ప్లాస్టిక్ చాలా ప్రమాదమట.. గ్లాసులో ఉన్న కాఫీ నుండి ఆ వేడికి కెమికల్ బయటికి విడుదలవుతుందట.. ఈ రోజుల్లో ప్లాస్టిక్ ఫిలిం పాలిలాక్లైడ్ PLA బయో ప్లాస్టిక్ రకం తో తయారు చేయబడుతోందట.. ఇందులో 99% ప్లాస్టిక్ ఉంటుందట. మామూలుగా ప్యాకేజింగ్ లో మొక్కజొన్న సరుగుడు చెరుకునుండి ఉత్పత్తి అయిన వాటిని ఎక్కువగా ఉపయోగించేవారు.. అయితే ఇవి అంత ప్రమాదం కాదట.. కానీ ప్లాస్టిక్ వాటికంటే ఎక్కువగా విచ్చిన్నం కాబోతోంది. ముఖ్యంగా కాలే వాటిని ఆ ప్లాస్టిక్ ప్లేట్ల పైన పెడితే కచ్చితంగా అందులో కెమికల్ వంటివి కరుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు.
ఈ మధ్యకాలంలో బయో ప్లాస్టిక్లతో తయారుచేసిన వాటిని నేల మీద నీటిమీద వేసినప్పుడు మాత్రం వెంటనే భూమిలో కలిసే గుణాన్ని కలిగి ఉండడం లేదని నిపుణులు తెలుపుతున్నారు.. ఈ కప్పుల వల్ల పర్యావరణానికి చాలా హాని కలుగుతోందని.. ప్లాస్టిక్ ప్రకృతిలో ఇలాగే కొనసాగితే జంతువులు మానవులు చాలా ప్రమాద బారిన పడే అవకాశం ఉంటుంది.. అందుకే పేపర్ ప్లాస్టిక్ వంటివి చాలా ప్రమాదంగా మారుతున్నాయి అందుకే వీలైనంతగా వీటిని తగ్గించి అరటి ఆకులలో టేకు ఆకులలో తినడం చాలా మంచిది. ఇవి తొందరగా భూమిలో కరిగిపోవడమే కాకుండా సారవంతమైన నేలను కూడా చేస్తాయట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి