
మరి ఈ సమస్యను అదుపులో ఉంచుకోవాలి అంటే రాత్రిపూట నిద్రించే ముందు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు డయాబెటిస్ ను కంట్రోల్ చేయవచ్చు అని చెబుతున్నారు. ఎండిన చామంతి పువ్వులతో తయారు చేసిన టీ ని డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు ఒక కప్పు తాగితే చాలా మంచిదట.
అలాగే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొన్ని నానబెట్టిన బాదంపప్పులను తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని కూడా చెబుతున్నారు. ఎందుకంటే బాదం లో ఉండే పోషకాలు రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గిస్తాయట.
మెంతులు కూడా డయాబెటిస్ ను తగ్గించడంలో సహాయపడతాయి. మెంతులు హైపోగ్లైసమిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. కాబట్టి నిద్రించే ముందు ఉదయం నానబెట్టిన మెంతులను తీసుకోవడం వల్ల చక్కెర స్థాయి అదుపులో ఉంటుందట.
ఇక యోగ చేసేటప్పుడు యోగాలో వజ్రాసనం డయాబెటిస్ నిర్వహణలో చాలా మంచి ఫలితాలను అందిస్తుందని.. నిద్రపోయే ముందు వజ్రాసనం వేయడం వల్ల రక్తపోటు అలాగే రక్తంలో చక్కెర స్థాయి కూడా అదుపులో ఉంటాయని.. రక్తప్రసరణ కూడా మెరుగవుతుందని సమాచారం. శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం , ఒత్తిడి తగ్గించుకోవడం లాంటివి చేస్తే డయాబెటిస్ ను కంట్రోల్ చేయవచ్చు.