మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్ లో ఖచ్చితంగా విటమిన్ డి కూడా ఒకటి. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ డి ఖచ్చితంగా ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచడంలో, ఎముకలను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచడంలో, అస్థి పంజర వ్యవస్థను సక్రమంగా ఉంచడంలో, కండరాలను బలోపేతం చేయడంలో ఇలా అనేక రకాలుగా ఈ విటమిన్ డి మనకు సహాయపడుతుంది.అయితే చాలా మంది కూడా విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి బయటపడడానికి చాలా మంది విటమిన్ డి సప్లిమెంట్స్ పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. విటమిన్ డి సప్లిమెంట్లు మంచివే అయినప్పటికి చాలా మందికి వాటిని ఎంత మోతాదులో తీసుకోవాలో అస్సలు తెలియదు. అందువల్ల ఈ సప్లిమెంట్స్ ను వారికి నచ్చినట్టుగా తీసుకుంటున్నారు. దీంతో శరీరంలో విటమిన్ డి స్థాయిలు ఎక్కువై అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇంకా అంతేకాకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారు విటమిన్ డి సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల అవి విషపూరితమై అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది.


విటమిన్ డి సప్లిమెంట్స్ ను ఎవరూ తీసుకోకూడదు.శరీరంలో విటమిన్ డి స్థాయిలు ఎక్కువవడం వల్ల మనకు కలిగే హాని ఏమిటి వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.గ్రాన్యులోమాటస్ డిజార్డర్స్, జీర్ణక్రియ సమస్యలతో బాధపడే వారు ఇంకా పుట్టుకతో వచ్చే వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారు విటమిన్ డి సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల అవి విష పూరితంగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. మన శరీరంలో 30 నుండి 60 ఎన్ జి/ ఎమ్ ఎల్ మోతాదులో విటమిన్ డి స్థాయిలు అనేవి ఉండాలి. విటమిన్ డి స్థాయిలు ఇంత కంటే ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో క్యాల్షియం స్థాయిలు బాగా ఎక్కువవుతాయి. క్యాల్షియాన్ని గ్రహించడంలో విటమిన్ డి మనకు సహాయపడుతుంది. శరీరంలో విటమిన్ డి ఎక్కువగా ఉండడం వల్ల తిన్న ఆహారం నుండి క్యాల్షియం అనేది బాగా గ్రహించబడుతుంది. అందువల్ల శరీరంలో క్యాల్షియం స్థాయిలు పెరిగి తలతిరగడం, వాంతులు, ఆకలి లేకపోవడం, హైబీపీ ఇంకా మూత్రిపండాల్లో రాళ్లు వంటి సమస్యలు తలెత్తుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: