పైనాపిల్ తో చేసే ఈ చాట్ చాలా రుచిగా ఇంకా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంకా స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. పండ్లు తినడం ఇష్టపడని పిల్లలకు ఇలా వాటితో చాట్ ను తయారు చేసి పెడితే చాలా ఆరోగ్యంగా ఉంటారు.ఈ చాట్ ను తయారు చేయడం చాలా ఈజీ. కేవలం 5 నిమిషాల్లో ఈ చాట్ ను తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ పైనాపిల్ చాట్ ను ఎలా తయారు చేసుకోవాలి? ఇంకా దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ పైనాపిల్ చాట్ తయారీకి కావల్సిన పదార్థాలు..చిన్నగా తరిగిన పైనాపిల్ ముక్కలు  ఒక కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, కీరదోస తరుగు  అర కప్పు, ఉడికించిన ఆలూ తరుగు  పావు కప్పు, చిన్నగా తరిగిన టమాట  1, క్యారెట్ తురుము పావు కప్పు, ఉప్పు  కొద్దిగా, గరం మసాలా  పావు టీ స్పూన్, చాట్ మసాలా  పావు టీ స్పూన్, మరమరాలు  50 గ్రా., తరిగిన కొత్తిమీర  కొద్దిగా, వేయించిన పల్లీలు  గుప్పెడు తీసుకోవాలి.


పైనాపిల్ చాట్ తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మీరు ఒక గిన్నెలో పైనాపిల్ ముక్కలను వేసుకోవాలి. ఆ తరువాత ఇందులో మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆరోగ్యకరమైన పైనాపిల్ చాట్ తయారవుతుంది. దీనిని నేరుగా ఇలాగే తినవచ్చు లేదా అరగంట పాటు ఫ్రిజ్ లో ఉంచిన తరువాత కూడా తినవచ్చు. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచచ్చు. ఇక బరువు తగ్గాలనుకునే వారు ఇలా రాత్రి సమయంలో భోజనానికి బదులుగా ఇలా పైనాపిల్ తో చాట్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.దీనిని అందరూ చాలా ఇష్టంగా తింటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: