ఇంకా ఈ పచ్చి బఠానీల వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనే విషయానికి వస్తే.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు పచ్చి బటానీలు చాలా మేలు చేస్తాయి. ఇందులో తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ కలిగి ఉండడం వల్ల చక్కెర నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. ఇక మీరు కూడా షుగర్ పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటే కచ్చితంగా ఈ కాలంలో పచ్చి బఠాణీలను తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఇకపోతే పచ్చి బఠానీలు పోషకాల భాండాగారం అని చెప్పాలి. ఇందులో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అంతే కాదు గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. వీటిలో ఉండే కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను సాధారణీకరిస్తుంది. తద్వారా గుండె సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. చలికాలంలో రోజు పచ్చి బఠానీలు తింటే పేగులలో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెంది దీనివల్ల కడుపు సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతాయి. అంతేకాదు శరీరంలో ఐరన్ లోపం వల్ల బలహీనత, అలసట వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి వారు మీ ఆహారంలో పచ్చిబఠానీలు చేర్చుకుంటే తప్పకుండా ఎర్ర రక్త కణాల పెరుగుదలకు ఇది సహాయపడుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి