సాధారణంగా నారింజలో యాంటీ ఆక్సిడెంట్,విటమిన్ సి ఫైబర్ వంటి మూలకాలు పుష్కలంగా లభిస్తాయి.ఇవి చలికాలంలోనే ఎక్కువగా లభిస్తాయి.కనుక ఈ సీజన్లో తీసుకోవాల్సిన పండ్లలో ఇది ఒకటి అని చెప్పవచ్చు.
చర్మ సమస్యలకు..
సాధారణంగా చలికాలం వచ్చిందంటే చాలు దద్దుర్లు,దురద,ఎగ్జిమా,మొటిమలు,మచ్చలు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది.అలాంటి వారికి ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్, ప్లేవానాయిడ్స్,విటమిన్ సి బాగా ఉపయోగపడి చర్మ సమస్యలను దూరం చేస్తుంది.
క్యాన్సర్ నివారించడానికి..
ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ కు కారణమైన ప్రిరాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ దరిచేరకుండా మన శరీరాన్ని కాపాడుతుంది.
రోగనిరోధకశక్తికి..
చాలామంది చిన్న జ్వరం కానీ జలుబు గాని వచ్చిందంటే చాలు నీరసంగా వీక్ గా తయారవుతూ ఉంటారు.చిన్న చిన్న సీజన్ మార్పిడికి ఎక్కువ వ్యాధులకు గురవుతూ ఉంటారు.దీనికి కారణం మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం.అటువంటి వారికి నారింజపండు చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇందులో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కంటి సమస్యలు..
నారింజలో లుటిన్,జియాక్సంతిన్ అనే కెరోటినాయిడ్లు పుష్కళంగా ఉంటాయి.ఇవి కంటి సమస్యలకు కారణమయ్యే రెటీనా యొక్క కేంద్ర భాగమైన మాక్యులాలో పేరుకుపోతాయి.దానితో దృష్టి నష్టానికి ప్రధాన కారణం వయస్సు పైబడడంతో మాక్యులర్ క్షీణత నుండి కళ్ళను రక్షించడంలో ఉపయోగపడతాయి.
బ్లడ్ సర్కులేషన్ కోసం..
చాలామందికి బ్లడ్ సర్కులేషన్ సరిగా జరగక గుండె సంబంధిత సమస్యలు మరియు రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటివారికి నారింజ పండ్లు చాలా బాగా ఉపయోగపడతాయి.ఇందులో ఉన్న ప్లవనాయిడ్లు మరియు విటమిన్ సి బ్లడ్ క్లాట్స్ ని తొలగించి రక్త సరఫరా సరిగా జరగడానికి దోహదపడుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి