శీతాకాలం అంటేనే చాలామంది భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ కాలంలోనే ఎక్కువగా జబ్బులు వంటివి వస్తూ ఉంటాయి. శీతాకాలంలో ఎండా వేడి అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది ఉదయం లేచింది మొదలు సూర్యుడు కనపడడం చాలా అరుదుగా ఉంటుంది. దీంతో దోమల బెడద ఎక్కువగానే ఉంటుంది దీనివల్ల మలేరియా, టైఫాయిడ్ ,డేంగ్లు ఇతరత్రా జ్వరాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుచేతనే దోమల పట్ల ఎవరు కూడా అశ్రద్ధ చూయించకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సైతం తెలియజేస్తూ ఉంటారు. మన ఇంటి చుట్టూ పరిసరాలలో ఉండేటువంటి మొక్కల వల్ల కూడా దోమలు ఇంటిదగ్గర కనిపించవట వాటి గురించి చూద్దాం.


1). తులసి మొక్క:
ఈ మొక్క వల్ల ఎన్నో ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి.. వీటి ఆకులు కూడా ఎన్నో రకాల వాటికి ఉపయోగపడుతుంది. తులసి మొక్క ఉన్నచోట దోమలు రాకుండా చూస్తుందట. తులసి ఆకులు రసాన్ని ఒంటికి రాసుకున్నట్లు అయితే దరిచారు.


2). బంతిపూలు:
ఈ బంతిపూల మొక్కలు ఇంటి ఆవరణంలో అక్కడక్కడ వేసినట్లు అయితే ఈ బంతిపూల వాసనలకు దోమలు దగ్గరికి కూడా రావట.బయటకాని ఎక్కడైనా ఇ బంతి పూల చెట్లు ఉంచితే దోమలు సైతం అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అయితే ఇందులో సపోనేస్ అనే సమ్మేళనం ఉంటుందట. దీనివల్ల దోమలు దూరంగా వెళ్లిపోతాయి.


3). రోజార్ని మొక్క:
ఈ మొక్క యొక్క పూల ఆకుల రసం వల్ల కూడా దోమలు ఇంటి ఆవరణంలో కనిపించవు. ఈ మొక్క అంతా కూడా నీరు గానే నిండి ఉంటుంది కనుక.. వీటి దగ్గరికి కూడా దోమలు రావు. ఈ మొక్క నుంచి నూనె కూడా తీసి బయట అమ్ముతూ ఉంటారు దీనిని శరీరానికి రాసుకున్న దోమలు కుట్టవట.


ఇదే కాకుండా లావెండర్ మొక్క నుండి విడుదలయ్యే స్మెల్ కూడా పలు అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ఈ మొక్కను కూడా ఇంటి ఆవరణంలో పెంచుకుంటే దోమలు ఈగలు ఇతర పురుగులు కూడా దరి చేరవు.

మరింత సమాచారం తెలుసుకోండి: