మనలో చాలా మందికి గొంతు నొప్పి గొంతు ఇన్ఫెక్షన్ ముక్కు అలర్జీ వంటివి చాలా వస్తూనే ఉంటాయి.. దగ్గుతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉంటాయి. ఏదైనా చల్లని పదార్థం తిన్న లేకపోతే చల్లని వాటర్ తాగినా కూడా వెంటనే జలుబు లేదా గొంతు ఇన్ఫెక్షన్ వంటివి వస్తూనే ఉంటుంది. దీని వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గొంతు ఇన్ఫెక్షన్ గొంతు నొప్పి వంటివి తగ్గించుకోవడానికి ఇప్పుడు ఒక చిట్కా పాటిస్తే సరిపోతుందట.వాటి గురించి తెలుసుకుందాం.




ఈ చిట్కాను పాటిస్తే ఎటువంటి మందుల జోలికి పోకుండా తగ్గిపోతుంది. ముందుగా ఒక గిన్నెలో కొన్ని మిర్యాలు తీసుకొని తిప్పతీగ కాడ చిన్న ముక్కలుగా కట్ చేసి అల్లాన్ని బాగా తురిమి సొంటి తో పాటు తులసి ఆకులను కూడా వేయాలి.. అయితే ఇందులోకి ఒక గ్లాసున్నర నీటిని పోసి కొద్దిసేపు మరగనివ్వాలి ఆ తర్వాత తిప్పతీగ ఆకు తీసివేసి రెండు నిమిషాల పాటు మరిగించాలి. ఆ వెంటనే కాస్త బెల్లాన్ని వేసి ఒక నిమిషం పాటు పొయ్యిని వెలిగించి ఆఫ్ చేయాలి.. అలా చల్లారాక ఒక గ్లాసులో వేసి వడగట్టి ఈ డ్రింక్ ని తగిన మోతాదులలో ఉదయం సాయంత్రం పూట తీసుకోవడం మంచిది.


దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా పెరగడం తో పాటు ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతూ ఉంటుంది. మనం సాధ్యమైనంత వరకు సమస్య చిన్నగా ఉన్నప్పుడే ఇలాంటి చిట్కాలను పాటించడం వల్ల వెంటనే నయం చేసుకోవచ్చు.. అయితే ఒకవేళ  ఇది ముదిరితే వైద్యుని సంప్రదించడమే మంచిది. కానీ ఈ చిట్కా మాత్రం కచ్చితంగా బాగా పనిచేస్తుందట. ఇందులో ఉపయోగించేటివన్నీ కూడా రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి. అందుకనే మన పూర్వీకులు సైతం చాలా దృఢంగా ఉండేవారు. ఏది ఏమైనా ఇలాంటివి ఉపయోగించేవారు అలర్జీ లేకుండా చూసుకోవాలి

మరింత సమాచారం తెలుసుకోండి: