పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. ఒంటరిగా సాగిపోతున్న జీవితానికి ఒక భాగస్వామిని వెతుక్కోవడమే పెళ్లి. ఇక ఆ భాగస్వామితోనే జీవితాంతం కష్టసుఖాలను పంచుకుంటూ జీవించడమే దాంపత్య జీవితం. అయితే పెళ్లి విషయంలో  ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి. ఈ క్రమంలోనే కొంతమంది పెళ్లి విషయంలో పాటించే సంప్రదాయాలు మిగతా వారికి ఆశ్చర్యకరంగా ఉంటాయి అని చెప్పాలి.


 ఇక ఇక్కడ కూడా పెళ్లి చేసుకోవాలనుకున్న యువకులు తప్పనిసరిగా పెళ్లికి ముందే ఓ పని చేయాలట. దక్షిణ ఆఫ్రికా లోని పలాన్ని తెగకు చెందిన ప్రజలు ఇక ఈ వింతైన ఆచారాన్ని ఆచరిస్తున్నారు. ఇంతకీ ఈ ఆచారంలో ఏం చేయాలో తెలుసా.. ఏకంగా పెళ్లి చేసుకోవాలనుకునే యువకులు ముందుగా కొరడా దెబ్బలు తినాలట. ఏకంగా యువకుల ధైర్యం సాహసం టెస్టు చేసే ఈ సాంప్రదాయాన్ని ఇక ప్రతి ఒక్కరు పాటిస్తారు. దీంతో పెళ్లి చేసుకోవాలనుకునే యువకులు ఏకంగా భరించలేని నొప్పిని భరించాల్సి ఉంటుంది. ఈ సాంప్రదాయాన్ని షారోప్ ఫెస్టివల్ అని అంటూ ఉంటారు. అంటే పలాని భాషలో కొరడాతో కొట్టడం.



 ఏకంగా పెళ్లికి సిద్ధమైన మగవాళ్ళు వారి బలాన్ని ఓర్పును పరీక్షించుకునేందుకు ఈ టెస్టులో పాల్గొనాల్సి ఉంటుంది. సంవత్సరానికి ఇది రెండు సార్లు జరుగుతుందట. ఇక ఈ ఫెస్టివల్ లో అందమైన అమ్మాయిల ముందు అవివాహిక పురుషుల మధ్య జరిగే కొరటా దెబ్బలు పోటీ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుందట. పురుషుల చొక్కాలను తీసివేసి మరి ఇలా కొరడాలతో కొడతారట. ఇక ఈ టెస్ట్ జరుగుతున్నప్పుడు పురుషులు అరవకూడదు అంతేకాదు నొప్పితో విలవిలలాడకూడదు. నవ్వుతూ పాట పాడుతూ డాన్స్ చేయాలట. వినడానికే భయమేస్తుంది కదా.. అయితే ఇలా కొనడా దెబ్బలు కొట్టినప్పుడు ఒంటిమీద పడే మచ్చలను ఇక ధైర్య సాహసాలకు గుర్తుగా అందరూ గౌరవిస్తూ ఉంటారట. నైజీరియా సెనెగల్ దేశాలలో ఈ పోటీలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: