సాధారణంగా వర్షాకాలం గాని,చలికాలం గాని మొదలైంది అంటే చాలు వైరల్ ఫీవర్ వైరల్ ఇన్ఫెక్షన్లు ఎంత కామనో,జుట్టు సమస్యలు కూడా అంతే కామన్ గా వస్తాయి.అందులో ముఖ్యంగా చుండ్రు తెగ బాధిస్తూ ఉంటుంది.దీనివల్ల జుట్టు రాలిపోవడం,జుట్టు చివర్ల చిట్లిపోవడం వంటి సమస్యలే కాక అధిక దురదను కూడా కలిగిస్తూ,స్కాల్ఫ్ లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలిగిస్తూ ఉంటుంది.ఈ చుండ్రుతో బాధపడేవారు రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ ని,యాంటీ డాండ్రఫ్ షాంపూను వాడినా కూడా పెద్దగా ఫలితం ఉండదు. అలాంటి వారి కోసమే ఇంట్లో దొరికే సహజ పదార్థాలతో చేసుకునే చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుందని డెర్మటాలజీస్ట్లు సైతం చెబుతున్నారు.అసలు ఆ చిట్కా ఏంటో,తర్వాత కావాల్సిన పదార్థాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండి..

దీనికోసం ముందుగా ఒక కప్పు కొబ్బరి నూనె తీసుకొని మందపాటి గిన్నెలో వేసి స్టవ్ పైన ఉంచాలి.కొబ్బరినూనె యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జుట్టు సమస్యలను తొలగించడంలో ముందుంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వేపపిండి,ఒక స్పూన్ మెంతులు,గుప్పెడు మందార పువ్వులు,రెండు షికాకాయలు వేసి బాగా మరిగించాలి.ఇది బాగా మరిగాక,చల్లారనిచ్చి,వడకట్టి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.

ఈ నూనెను తల స్నానం చేసుకోవాలన్నప్పుడు అరగంట ముందే మాడుకు అప్లై చేసి,బాగా మసాజ్ చేసుకొని అలానే వదిలేయాలి.ఆ తరువాత మైల్డ్ షాంపూ తో స్నానం చేస్తే సరిపోతుంది.మరియు ఈ సీజన్లో మాయిశ్చరైజర్ ని అప్లై చేయడం మాత్రం చాలా ముఖ్యం.దీనివల్ల స్కాల్ పొడిబారకుండా ఉంటుంది. చలికాలంలో ఇలా పొడిబారడం వల్లనే చుండ్రు సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి.

మరియు దీంతోపాటు రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగడం కూడా చాలా ముఖ్యం.అధిక నీరు తీసుకోవడం వల్ల తేమ బాగా అంది,మాయిశ్చరైజింగ్ గా మెరుగ్గా ఉంటుంది.అంతేకాక జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూ ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు సమస్యలను దరిచేరకుండా కాపాడుకోవచ్చు.కాబట్టి మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే,వెంటనే ఈ చిట్కా వాడి చూడండి

మరింత సమాచారం తెలుసుకోండి: