ప్రతి మనిషి తమ్ముడు ఆర్థికంగా ఎదగాలని 10 మందిలోనూ వారు ఒకరిగా బతకాలని తపిస్తూ ఉంటారు.ఆర్థికంగా ఎదగడానికి మరియు పదిమందిలో వారు గుర్తింపును పొందాలి అంటే కచ్చితంగా ఉండాల్సిన కొన్ని గుణాలలో డబ్బు కూడా ఒకటి.అలాంటి డబ్బుకు ఆది దేవత అయిన లక్ష్మీదేవి కటాక్షం కోసం ప్రజలు చేయని ప్రయత్నమంటూ ఉండదు.జీవితంలో సంపదలు, ఐశ్వర్యాలు కలగాలని అందరు మనస్ఫూర్తిగా పరితపిస్తూ ఉంటారు.డబ్బులు కోసం పూజలు,వ్రతాలు చేసేవారు లేకపోలేదు.ఇన్ని చేసినా కొంతమంది ఇళ్లలో అసలు డబ్బు నిలవదు. దీనికి కారణం కుటుంబంలోని సభ్యులు పదే పదే కొన్ని రకాల పదాలను వాడుతూ ఉండడం వల్ల,ఇంట్లోకి దరిద్ర దేవత ఆవహిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. కావున ఎలాంటి పదాలు వాడటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో నిలబడకుండా వెళ్ళిపోతుందో మనము తెలుసుకుందాం పదండి..

కొంతమంది పదే పదే డబ్బు కోసం తప్పుడు మార్గాలను ఎంచుకుంటూ వుంటారు.ఇదే అసలైన అతి పెద్ద తప్పు, మరియు కుటుంబంలో కొంతమంది ఎప్పుడు ‘నా దగ్గర తగినంత డబ్బు లేదు’ అని మాట్లాడుతూ వుంటారు.ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడకూడదని,దీనితో దరిద్ర దేవత అవహిస్తుంది. అలా కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పాటించాల్సిన మొదటి నియమం ‘నా దగ్గర ఏమీ లేదు’ అని ఎప్పుడూ అనుకోకూడదు.ఇంకొంతమంది డబ్బు లేకపోవడంపై ఎక్కువగా ఆందోళన పడుతుంటారు. అంతే కాక సంపన్నంగా ఉన్నారని చూపించే ఏదీ మీ వద్ద లేదని చెబుతూ బాధపడుతుంటే మీ దగ్గర ధనం అస్సలు నిలబడదు.దీనికి బదులుగా ‘నేను సమృద్ధిగా ఉన్నాను’, ‘నేను సంపన్నుడిని’, ‘నాకు డబ్బు సులభంగా వస్తుంది’, ‘నేను అదృష్టవంతుడిని’ అని అనుకుంటూ ఉండాలి. అప్పుడే దరిద్ర దేవత మన ధ్యేర్యానికి బయపడి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది.దీనితో లక్ష్మీదేవి కటాక్షం కలిగి, కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది.

ఇలాంటి మాటలు ఎక్కువగా ఇంట్లోనే ఆడవారే మాట్లాడుతూ ఉంటారు.కావున తల్లులు మరియు భార్యలు ఇంట్లోని మగవారి గురించి అస్సలు ఎలా బెంగపడకూడదు అని చెబుతుంటారు.కావున మీరు కూడా ఇలాంటి తప్పు చేస్తూ ఉంటే,వెంటనే మానుకోవడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: