మన శరీరారోగ్యం మనం తినే ఆహారం పైనే అధిక శాతం ఆధారపడి ఉంటుంది.మరీ ముఖ్యంగా మనం తినే ఆహారంలో ప్రోటీన్,క్యాల్షియం,ఫైటో న్యూట్రియన్స్ వంటి పోషకాలు ఎన్నో తప్పకుండా ఉండాలి.వీటిని సరైన క్రమంలో తీసుకుంటేనే మన ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది.అలాంటి ప్రోటీన్ శరీరానికి ఏ ఏ ప్రయోజనాలు చేకూరుస్తుందో తెలిస్తే ఈసారి మాత్రం కచ్చితంగా ప్రోటీన్ ఉండేలా చూసుకుంటారు.ఈ ప్రోటీన్ లోపం కారణంగా చాలా అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది.అస్సలు మన శరీరానికి ఎంత ప్రోటీన్ అవసరమో,వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో మనము తెలుసుకుందాం పదండి..

సగటు మనిషి శరీర బరువును శరీర బరువును బట్టి ప్రోటీన్ అవసరం ఉంటుంది.ఎలా అంటే 60 కేజీల బరువు ఉన్న మనిషికి ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.అంటే ఒక కేజీకి ఒక మిల్లి గ్రాము చొప్పున అవసరం వస్తుంది.కావున ప్రతి ఒక్కరూ ఈ ప్రోటీన్ వాడు తినే ఆహారంలో పొంది,ప్రోటీన్ లోపం లేకుండా చూసుకోవాలి.

మనం సజావుగా ఆరోగ్యంగా తిరగాలి అంటే కచ్చితంగా ప్రోటీన్ అవసరం.మన కండర శక్తి ప్రోటీన్ ఇంటెక్ పైన ఆధారపడి ఉంటుంది.ఇంకా చెప్పాలంటే  స్పోర్ట్స్ పర్సన్ కి ఎక్కువ ప్రోటీన్ అవసరం ఉంటుంది.అలాంటివారు ప్రోటీన్ షేక్స్లోనూ,టాబ్లెట్ల రూపంలోనూ తీసుకుంటూ ఉంటారు.

జుట్టు ఆరోగ్యం..

జుట్టు యొక్క నిర్మాణాన్ని ప్రోటీన్లు అత్యంత ముఖ్యమైనవి.జుట్టు పెరగడానికి బీటాప్రోటీన్ అని ప్రోటీన్ కంపల్సరీ ఉండాలి.ఇలాంటి ప్రోటీన్ తక్కువగా ఉంటే కొల్లాజెన్‌లో నిర్మాణాత్మక మార్పులకు కారణమవుతుంది.దీనితో జుట్టు రాలడం మరియు జుట్టు పలుచబడడం,జుట్టు చివర్లు దెబ్బతినడం వంటివి జరుగుతాయి.అంతేకాక చర్మం యొక్క కొల్లాజన్ పెంచి వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.

పిల్లల ఎదుగుదలకు..

ప్రోటీన్లు పిల్లల యొక్క సరైన ఎదుగుదల మరియు అభివృద్ధికి ఉపయోగపడతాయి.మరియు చిన్న వయసులో వచ్చే ఇన్ఫెక్షన్లు,అనారోగ్యాలు మరియు ఎముకల అభివృద్ధి అడ్డుపడతాయి.అలాంటి వాటిని నివారించడానికి పిల్లల ఆహారంలో తప్పనిసరిగా ప్రోటీన్ ఉండేలా చూడాలి.

బరువు తగ్గడానికి..

ప్రోటీన్లు శరీర కండర శక్తిని మెరుగుపరుస్తాయి.మరియు కొవ్వులను కరిగించడంలో సహాయపడతాయి.దీనితో తద్వారా కొవ్వు కరగడం మొదలవుతుంది.దీని కారణంగా అథ్లెట్లకు కూడా ప్రోటీన్లు అధికంగా తీసుకుంటూ వుంటారు.మరియు ప్రోటీన్ తక్షణ శక్తిని అందిస్తుంది కూడా.

మెదడు మరియు గుండె కోసం..

న్యూరోట్రాన్స్మిటర్లు పనిచేయడానికి ప్రోటీన్లు చాలా ముఖ్యమైనవి.మరియు సరైన మెదడు పనితీరుకు ఇవి అవసరం.ముఖ్యంగా మహిళల్లో గుండె సంబంధిత రుగ్మతల ప్రమాదాన్ని ప్రోటీన్లు తగ్గిస్తాయని కనుగొనబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: