వేసవి మొదలైందంటే చాలు ఎండ తీవ్రత,వేడి ఎంతగా ఇబ్బంది పడతాయో,అంతే మోతాదులో చీమలు కూడా ఇబ్బంది పెడతాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఈ సమయంలో ఎక్కువగా చీమలు నల్ల చీమలు ఎర్ర చీమలు అంటూ వస్తూ ఉంటాయి.ఏదైనా ఆహార పదార్థం కింద పడిందంటే చాలు ఇంక దాని చుట్టూ ఎర్ర చీమలు చేరిపోతాయి.ఇంక చిన్న పిల్లలు ఉన్నారంటే వారికి తెలియకుండానే ఆ చీమలు దగ్గరికి వెళ్తూ ఉంటారు.దానితో అవి తెగ కుట్టేసి వారిని మరింత బాధపెడతాయి.అలా కాకుండా ఇంట్లో చీమలు లేకుండా చిటికెలో చేయాలి అంటే కొన్ని రకాల చిట్కాలు పాటించాలి.అవేంటో మనము తెలుసుకుందాం పదండీ..

ఒక్కొక్కసారి ఇల్లు శుభ్రంగా లేకపోయినా కూడా చీమలు వస్తూ ఉంటాయి.అందువల్ల మనం ఇల్లు శుభ్రం చేసేటప్పుడు,ఆ నీటిలో ఫినాయిల్ కానీ,రాళ్ల ఉప్పు కానీ వేసి శుభ్రం చేయడం వల్ల ఇంట్లోని బ్యాక్టీరియా నశించి పోవడమే కాకుండా,చీమల బెడద కూడా తగ్గిపోతుంది.

 ఇంకా తీపి వస్తువులు ఎక్కడైనా పెడితే వాటికి దారి మనం చూపెట్టాలా చెప్పండి.అలా స్వీట్లు కానీ,చక్కెర బెల్లం వంటివి కానీ నిలువ చేసే ప్రదేశంలో మార్కెట్లో దొరికే చాక్ పీసులు రాయడం చాలా మంచిది.ఇలా రాయడం వల్ల చీమలు వాటి దరిచేరవు.

ఈ మధ్యకాలంలో పప్పులు,ఆయిల్ వంటి పదార్థాలకు కూడా చీమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.అలాంటి వాటి చుట్టూ కూడా చాక్పీస్ గీయడం చాలా ఉత్తమం.

మరియు చక్కెర బెల్లం వంటివి ఎక్కువ మోతాదులో నిలువ చేసుకోవాలి అంటే వాటిలో ఐదారు లవంగాలు వేసి నిలువ చేసుకోవడం వల్ల,లవంగాలలోని ఘాటుతో చీమలు దరిచేరకుండా ఉంటాయి.

కొంతమంది ఇళ్లలో నల్లచీమలు ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాయి.వారు ఆ చీమలు పుట్ట ఉన్న ప్రదేశంలో కుంకుమ కాని,పసుపు కాని చల్లడం వల్ల ఆ ప్రదేశాన్ని వదిలి వేరే చోటికి వెళ్లిపోతాయి.

కావున మీరు కూడా చీమల బెడదతో బాధపడుతూ ఉంటే..వెంటనే ఈ చిట్కాలు పాటించి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: