ఈ రోజుల్లో గ్యాస్‌, ఎసిడిటీ సమస్య చాలా సాధారణమైపోయాయి. ఇప్పుడు ప్రతి ఇద్దరిలో ఒక్కరు ఎసిడిటీ సమస్యతో బాధపడుతుంటారు. అసిడిటీ సమస్యతో బాధపడే వ్యక్తికి చాలా బాధాకరమైనదిగా ఉంటుంది. వేపుడు, మసాలా, కారం ఆహారాన్ని తినడం వల్ల లేదా మరేదైనా కారణం వల్ల అసిడిటీ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎసిడిటీ వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. దీని కారణంగా వ్యక్తి కడుపు లేదా తలనొప్పి, కడుపులో మంట వంటి చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్‌ మాత్రలు వేసుకోవడం మంచిది కాదు.. అలా అని తీసుకోకుండా ఉండలేదు.. అయితే, సాధ్యమైనంత వరకు గ్యాస్ సమస్యను నయం చేయడానికి ఇంటి నివారణ చిట్కాలను పాటించవచ్చు. మన వంటింట్లో ఉండే పానీయాలు ఎసిడిటీ, గ్యాస్‌ని తగ్గించడంలో సహాయపడతాయి. ఎసిడిటి,గ్యాస్ సమస్య వస్తే ఖచ్చితంగా మజ్జిగ తాగండి. దీన్ని తాగడం వల్ల కడుపులో మంట నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. ఇంట్లోనే మజ్జిగ తయారు చేసుకొని తాగితే మేలు జరుగుతుంది.


యాసిడ్ ప్రభావాలను తగ్గించడానికి ఇంగువ కూడా మంచి ఎంపికగా పరిగణిస్తారు. ఇది జీర్ణవ్యవస్థను ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందువల్ల మీరు ఇంగువ నీటిని కూడా తాగవచ్చు. అసిడిటీ సమస్య ఉన్నవారు, కూరను వండేటప్పుడు ఇంగువ వేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.ఎసిడిటీ సమస్య వస్తే నిమ్మరసం, బ్లాక్ సాల్ట్, సోడా కలిపిన నీటిని తాగితే ఎసిడిటీ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు.వాము నీటిని తాగడం ద్వారా మీరు ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. 1 కప్పు సాధారణ నీటిలో అర చెంచా వాము గింజలను వేసి తాగడం వల్ల ఎసిడిటీ సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు.ఎసిడిటీ సమస్యకు చల్లని పాలు తాగితే ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎసిడిటీ సమస్య వస్తే అందులో పంచదార లేదా ఉప్పు లాంటి.. ఎలాంటి పౌడర్ వేయకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: