సాధారణంగా కివి పండును మనదేశంలో అంతగా సాగు చేయరు కానీ,విదేశాలలో చాలా బాగా సాగు చేస్తారు.ఈ పండు ఈ మధ్యకాలంలో మనదేశంలో విరివిగా లభిస్తూ ఉంది కూడా.మరియు పిల్లలు,పెద్దలను తేడా లేకుండా ఇష్టంగా తినే పండ్లలో కివి పండు కూడా ఒకటనీ చెప్పవచ్చు.ఎందుకంటే ఇది తియ్య తియ్యగా, పుల్లపుల్లగా చాలా మంచి రుచిని కలిగి ఉంటుంది.ఇది రుచికి మాత్రమే కాదు ఆరోగ్యాన్ని పంచిపెట్టడంలో కూడా దిట్ట అని చెప్పవచ్చు.ఎందుకంటే ఇందులో అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి కనుక.అసలు కివి పండుతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి మనము తెలుసుకుందాం పదండి..

కివిలో విటమిన్లు,మినరల్స్,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.విటమిన్ సి,విటమిన్ కె, విటమిన్ ఇ,పొటాషియం,ఫోలేట్ అధిక మొత్తంలో దొరుకుతుంది.కివీస్ డైటరీ ఫైబర్‌ను కూడా అందిస్తుంది.

జీర్ణ సమస్యలు తొలగించడానికి..

కివి పండు తరచూ తీసుకోవడం వల్ల,ఇందులో ఉన్న డైయేటరీ ఫైబర్స్ జీర్ణక్రియను వివేకవంతం చేసి,మనం తిన్న ఆహారం నుంచి చెడుకోవ్వులను తొలగించడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది.దీనితో అజీర్తి వంటి సమస్యలు తగ్గడమే కాకుండా,బరువు తగ్గడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి పెంచడానికి..
కివి పండులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.దీనితో మన శరీరంలో ఉన్న రోగనిరోధక వ్యవస్థ బలంగా మారి,సీజనల్గా వచ్చే రోగాలను మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

ఆస్తమాను తగ్గించడానికి..

కివీస్‌ను క్రమం తప్పకుండా తినడంతో ఉబ్బసం కలిగిన శ్వాసకోశ లక్షణాలు,తీవ్రతను తగ్గించడంలో సాయపడవచ్చునని అధ్యయనాలలో కూడా తేలింది. మరియు ఇందులో విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉండడంతో ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి.

మెదడు పనితీరు మెరుగుపర్చడానికి..

కివీస్ యాంటీఆక్సిడెంట్లు,అవసరమైన పోషకాలను అందిస్తుంది.మెదుడు పనితీరును,జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.అంతేకాక న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఎముకలు బలంగా తయారవడానికి..

కివీస్‌లో విటమిన్ కె,కాల్షియం,ఫాస్పరస్ వంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి.ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి,బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి చాలా బాగా సహాయపడతాయి.

కావున ఈసారి మార్కెట్లో కివి పండ్లు కనబడితే, కచ్చితంగా తెచ్చుకుని తినడం మర్చిపోకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: