సైకో.. ఈ పదం వినిపించింది అంటే చాలు ఎక్కువగా అందరికీ గుర్తుకు వచ్చేది అబ్బాయిలే. ఎందుకంటే అబ్బాయిలే ఎక్కువగా సైకోలుగా ప్రవర్తిస్తూ ఉంటారు అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఏకంగా కొంతమందిలో ఈ సైకోఇజం తక్కువగా ఉంటే.. ఇంకొంతమందిలో మాత్రం ఏకంగా ప్రాణాలు తీసే అంత సైకో ఇజం ఉంటుంది అన్నది అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది. అదేంటో గాని సినిమాలలో కూడా అబ్బాయిలనే సైకోలుగా చూపించడం చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సినిమాలలో అమ్మాయిలను కూడా సైకోలుగా చూపించారనుకోండి ఆ విషయం పక్కన పెడితే. ఎక్కువ మటుకు మాత్రం సైకో అనే టైటిల్ తో ఏదైనా సినిమా వచ్చింది అంటే అందులో అబ్బాయిలనే ప్రధాన పాత్రలో నటింప చేయడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇలా అబ్బాయిలు మాత్రమే సైకోలు అన్న విధంగా సభ్య సమాజంలో కూడా ముద్ర పడిపోయింది. అయితే ఈ విషయం గురించి ఎప్పుడైనా అబ్బాయిలు ఆలోచించారు అంటే.. సైకోలు అని ఎందుకు అబ్బాయిలనె అంటారు అమ్మాయిలు కూడా కొంతమంది ఇలా సైకో లాగానే బిహేవ్ చేస్తూ ఉంటారు కదా అని అనుకుంటూ ఉంటారు. నిజమే ఇప్పటివరకు అమ్మాయిల మీద పెద్దగా పరిశోధనల్లో కాన్సెంట్రేట్ చేయలేదు. కానీ ఇక అమ్మాయిలు కూడా సైకోనిజం విషయంలో అబ్బాయిల కంటే ఎక్కడా తక్కువ కాదట   ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం బయటపడింది.

 మహిళల్లోనూ సైకోల సంఖ్య ఎక్కువే అంటూ ఇంగ్లాండ్ పరిశోధకులు చెబుతున్నారు. తక్కువ పరిశోధన,  కేవలం ఖైదీలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడంతో ఇక వీరిని గత పరిశోధకులు గుర్తించలేదు అని చెబుతున్నారు ఇంగ్లాండ్ సైంటిస్టులు. పురుషులతో పోల్చి చూస్తే వీరి లక్షణాలు కాస్త భిన్నంగా ఉండటం కూడా మహిళల్లోని సైకోఇజాన్ని నిజానికి గుర్తించకపోవడానికి  ఒక కారణమట. అయితే మహిళలు భౌతికంగా కంటే మాటలతో హింసించేందుకే ప్రాధాన్యం ఇస్తారట. ఇక సైకోలలో పురుషులు మహిళల నిష్పత్తి 6:1 గత పరిశోధనలు చెబితే.. ఇక ఇప్పుడు దాదాపు సైకో ఇజంలో మహిళలు పురుషులు నిష్పత్తి సరి సమానంగానే ఉంది అని ఇంగ్లాండ్ పరిశోధకులు తేల్చారు. ఈ విషయం తెలిసిన మగవాళ్ళు ఇది ముమ్మాటికి నిజమే అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: