ఇండియాతో సహా అనేక దేశాలలో బంగాల దుంపకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. భారతీయులు ఉపయోగించి అత్యంత ముఖ్యమైన ఆహార ఉత్పత్తులలో ఈ బంగాళదుంప కూడా ఒకటని చెప్పవచ్చు. సాధారణంగా వీటిని సాంబార్ పకోడా చిప్స్ కట్లెట్ ఇతరత్న వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.. ఇతరత్రా ఆహార లలో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. సాధారణంగా ఈ బంగాల దుంపలను ఉడకబెట్టి వేయించడం వంటివి చేస్తూ ఉంటారు. అందుచేతనే వీటిని పిల్లలు పెద్దలు తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

అయితే ఈ బంగాళాదుంపను ఎక్కువ తినడం మంచిదా లేదా అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు.. వాస్తవానికి బంగాళదుంపలు కూడా ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి.. ఇందులో షుగర్ లెవెల్స్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వేడి లక్షణాలు కూడా చాలానే కలిగి ఉంటాయట.. ఈ బంగాళదుంపలను ఒక నెలరోజుల పాటు తినకపోతే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో అనే విషయాన్ని కొంతమంది నిపుణులు తెలియజేశారు.. బంగాళదుంప గుండె కండరాల పనితీరుకి చాలా సహాయపడుతుంది.


బంగాళా దుంపను తినడం వల్ల తగినంత పోటీ ఫైబర్ కార్బోహైడ్రేట్లు విటమిన్లు మాంగనీస్ మెగ్నీషియం పొటాషియం వంటివి లభిస్తాయి.. ఎవరైతే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు వారు బంగాళదుంపలను తినడం వల్ల బరువు తగ్గవచ్చు.. బంగాళదుంపను ఫ్రై చేసి ఎక్కువగా తినడం వల్ల ఇది ఉపకాయానికి దారితీస్తుందట.. ఫాస్ట్ ఫుడ్ గా కాకుండా బంగాళదుంపను ఉడికించి తినడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు బంగాళదుంపలు చక్కెర స్థాయిలో ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో కలిసి చక్కెర స్థాయిలను వేగంగా పెంచేస్తుంది. అందుచేతనే బంగాళదుంపని తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి.. అందుకోసమే మధుమేహ వ్యాధి గ్రహస్తులు సైతం ఈ బంగాళదుంపను తినకుండా ఉండడమే మంచిది. అయితే ఒక నెల రోజులపాటు వీటిని తినకుండా ఉంటే శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయట.. బంగాళదుంపలను మసాలా దినుసులలో  నూనెలు వేయించుకోకుండ తినడం మంచిది

మరింత సమాచారం తెలుసుకోండి: