చాలా మందికి పచ్చి శనగల గురించి తెలియజేయాల్సిన పనిలేదు.. పల్లెల్లో వీటిని ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీటీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగానే ఉంటాయి.ఇందులో విటమిన్స్, ఖనిజాలు, ప్రోటీన్స్, ఫైబర్ వంటివి చాలా పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయట... అయితే ఈ పచ్చి శనగలను ఉడకబెట్టి లేదా పచ్చిగానే తిన్న ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. అలాగే చెడు కొవ్వు కూడా మన శరీరంలో తగ్గించేలా చేస్తాయి..


పచ్చి శనగలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని సైతం బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది.. ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా సరే తిప్పికొట్టే సామర్థ్యం ఈ పచ్చి శనగలలో ఉంటుంది.. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉండడం వల్ల మలబద్ధక సమస్య నుంచి ఉపశమనాన్ని కలిగించడమే కాకుండా జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరిచేలా చేస్తుంది.. పచ్చి శనగలలో మెగ్నీషియం పొటాషియం వంటి ఖనిజాలు చాలా పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తపోటును నియంత్రించడానికి ఉపయోగపడడమే కాకుండా గుండె జబ్బుల నుంచి కూడా బయటపడేలా చేస్తాయి.

పచ్చి శనగలలో గ్లైసిమిక్ ఇండెక్స్ అనే పదార్థం ఉండడం వల్ల ఇది రక్తంలోని ఉండే చక్కెర స్థాయిలను వేగంగా పెంచకుండా చేస్తాయి. మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉండేలా చేస్తాయట.


పచ్చిశనగలను అప్పుడప్పుడు తింటూ ఉండడం వల్ల చర్మం కూడా చాలా అందంగా కనిపించడమే కాకుండా చేతి గోళ్లు కూడా చాలా దృఢంగా పెంచేలా చేస్తాయి. పచ్చి శనగలను కూడా ఎన్నో రకాల వంటలలో మనం ఉపయోగించుకోవచ్చు.. ఇలా మనం పచ్చి శనగలను ఎన్నో రకాలుగా తిన్నా సరే మన శరీరానికి పలు రకాల పోషకాలు అందుతాయి.. పచ్చి శనగలు తినడానికి కాస్త ఉప్పుగా అనిపించిన తినడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: