అన్నం తినకపోయినా ఆరోగ్యంగా బ్రతకవచ్చేమో కానీ నీరు తాగకపోతే మాత్రం అసలు బ్రతకలేము. ఖచ్చితంగా నీరు ఖచ్చితంగా తాగాలి. అయితే నీళ్లు ఎలా పడితే అలా తాగినా కూడా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎలా తాగాకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.పెద్ద మొత్తంలో నీరు తాగటం ఖచ్చితంగా మానుకోండి. ఇది ప్రమాదానికి కారణం కావచ్చు, ఎందుకంటే నీరు శ్వాస నాళంలోకి చేరి అసౌకర్యానికి దారితీస్తుంది, ఇది మీ అవయవాలను కూడా షాక్ చేస్తుంది. నీరు తాగేటప్పుడు చిన్న సిప్స్ తీసుకుని శ్వాస తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది బరువు తగ్గడానికి, నిర్వహణకు కూడా సహాయపడుతుంది.నీటిని కూర్చున్న భంగిమలో ఉన్నప్పుడు తాగడం వల్ల కండరాలు, నాడీ వ్యవస్థ శాంతపరచడానికి మరియు ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగించదని, ఈ విధంగా వాటి వడపోత ప్రక్రియను సులభంగా చేయగలదని ఆయుర్వేదం చెబుతోంది.


నిలబడి నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని ఆయుర్వేదం చెబుతోంది. దీన్ని తాగితే నీరు ఎంతో శక్తితో, వేగంతో శరీరంలోకి ప్రవేశించి నేరుగా కడుపులోకి వెళ్తుంది. ఇది ద్రవాల సమతుల్యతను దెబ్బతీస్తుంది. అజీర్ణానికి కారణమవుతుంది. నిటారుగా నిలబడి నీరు తాగడం వల్ల కీళ్ళలో నీరు పేరుకుపోతుందని, దీనివల్ల ఆర్థరైటిస్ కూడా వస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఇక శరీరంలో ద్రవ సమతుల్యత దెబ్బతింటుంది. ఎముకలు, కీళ్ళలో నొప్పి, మంటను ప్రేరేపించే టాక్సిన్ పేరుకుపోవడాన్ని పెంచుతుంది. కూర్చునే సమయంలో నీటిని తాగితేనే మన శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మనం క్రమం తప్పకుండా నీరు తాగడం వల్ల మలబద్ధకం, అలసట వంటి కడుపు సమస్యలకు చెక్ పెట్టొచ్చు. నీరు తగిన మోతాదులో తాగితే అవయవాలను హైడ్రేట్ చేయడంతో పాటు, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కూడా నిర్వహిస్తుంది. రక్తపోటు కీళ్ళను లూబ్రికేట్ చేస్తుంది, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: