అంజీర్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా అంజీర్ ఆకుల్లో అపారమైన యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మధుమేహం బాధితులకు చాలా మంచిది. ఇందుకోసం ముందుగా 4 నుంచి 5 అంజీర చెట్టు ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి 10 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని టీలాగా తాగాలి. అంజీర్ ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకొని కూడా వాడవచ్చు. అర చెంచా పొడిని ఒక కప్పు నీళ్లలో కలిపి టీ లాగా తాగాలి. రెండు విధానాలు కూడా మధుమేహాన్ని అదుపుచేయడానికి చాలాబాగా పనిచేస్తాయంటున్నారు. ఈ పొడి ఎముకలకు మంచి బలాన్నిస్తాయి. అంజీర్‌ ఆకులలో పొటాషియం, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను బలపరుస్తాయి. గుండె జబ్బులతో బాధపడే వారికి కూడా అంజీర్‌ ఆకులను తీసుకోవడం వలన మేలు చేస్తుంది. వాస్తవానికి, దాని ఆకులలో ఒమేగా -3, ఒమేగా -6 ఉన్నాయి. ఇవి గుండెను బలోపేతం చేస్తాయి. అంతే కాదు, అత్తి ఆకులలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరం నుండి అదనపు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది.


అంజీర్‌తో పాటు నారింజ, ఆప్రికాట్లు, బొప్పాయి వంటి పోషకాలు అధికంగా కలిగిన పండ్లను తీసుకుంటే సులభంగా డయాబెటిస్‌ సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మధుమేహం వ్యాధితో బాధపడుతున్న రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇన్సులిన్ ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది.అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా అంజీర్‌ పండ్లను తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంజీర్‌లో ఉండే మూలకాలు అనారోగ్య సమస్యలను తగ్గించడమేకాకుండా మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులను కూడా దూరం చేస్తాయి. అంజీర్‌ పండ్లుమాత్రమే కాదు వాటి ఆకులలో కూడా ఔషధగుణాలున్నాయని చెబుతున్నారు. అంజీర్‌ ఆకులు మధుమేహానికి మందులా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి. గుండె సమస్యలు కూడా తగ్గుతాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: