చాలా మందికి ఇక దరిద్రమైన అలవాటు ఉంటుంది. అదేంటంటే పొద్దున్నే నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగుతారు. కొంతమంది అయితే బెడ్ కాఫీ అంటూ బ్రష్ చేయకుండా కంపు నోటితో టీ లేదా కాఫీ తాగుతారు. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు.ఇలా ఖాళీ కడుపుతో కాఫీ తాగకపోవడమే మీ ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల చాలా మందిలో ఎసిడిటీ, ఇతర సమస్యలు వస్తాయి.ఒకవేళ ఈ అలవాటు మానుకోలేకపోతే ఖాళీ కడుపుతో మొదట నీరు తాగి అదనపు ఔషధ గుణాలు కలిగిన ఆరోగ్యకరమైన పానీయం తాగండి.గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం పిండుకుని తాగొచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కడుపుని శాంతపరచడానికి సహాయపడుతుంది. అలాగే, గ్రీన్ టీ కూడా ఖాళీ కడుపుతో తాగడం మంచిది. ఇది అంతర్గత అవయవాల పనితీరును కూడా సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది కొవ్వును కాల్చడంలో చాలా సహాయపడుతుంది.అలాగే, ఖాళీ కడుపుతో స్పైసీ ఫుడ్ తినవద్దు. ఉదయం పూట స్పైసీ ఫుడ్స్‌కు దూరంగా ఉండటం మంచిది. ఇది వైర్ దెబ్బతినడానికి కూడా దారి తీస్తుంది. నారింజ వంటి సిట్రస్ పండ్లను ఉదయం తినడం వల్ల కూడా కడుపు నొప్పి వస్తుంది. కార్బోనేటేడ్ డ్రింక్స్, శీతల పానీయాల విషయంలో కూ డా అదే జరుగుతుంది.


 ప్రాసెస్ చేసిన ఆహారాలు, వేయించిన ఆహారాలు కూడా ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదు. ఇవి సాధారణంగా ఆరోగ్యానికి హానికరం. ఇది ఖాళీ కడుపుతో తినటం వల్ల కడుపు సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. కొందరికి పాలు, పాల టీ, ఇతర పాల ఉత్పత్తులను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్ ఎదురవుతుంటాయి. అలాంటి వారు కూడా ఖాళీ కడుపుతో వీటికి దూరంగా ఉండాలి.ఓట్ మీల్ ఖాళీ కడుపుతో తినడానికి మంచి ఆహారం. ఇందులోని పీచు ఆకలిని అణిచివేసి, తర్వాత మనం అతిగా తినకుండా చేస్తుంది. గ్రీక్ పెరుగు కూడా మంచి ఎంపిక. ఇందులో ఉండే ప్రొటీన్, ప్రోబయోటిక్స్ పొట్టకు, మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్లు కూడా చాలా మంది ఉదయం పూట తినే వంటకం. ఖాళీ కడుపుతో గుడ్లు తినవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే గుడ్లు ఖాళీ కడుపుతో కూడా తినవచ్చు. గుడ్లు ప్రోటీన్, ఇతర అద్భుతమైన పోషకాలను అందించడంలో సహాయపడతాయి. బెర్రీలు, బాదం, చియా గింజలు కూడా ఖాళీ కడుపుతో తినడానికి మంచి ఆహారాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: