అధిక బరువు చాలా ఈజీగా తగ్గాలి అనుకునే వారు.. ఖచ్చితంగా ప్రతి రోజూ ఉదయం పరగడుపున గోరు వెచ్చటి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.ఇంకా నిమ్మరసంలో విటమిన్ సి అనేది మెండుగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో బాగా సహాయ పడుతుంది. డయాబెటీస్‌తో బాధ పడేవారు నిమ్మ రసం తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.పైగా ఈ నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్.. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మలబద్ధకం సమస్యకు కూడా చెక్ పెడుతుంది. అంతే కాకుండా గుండెల్లో మంట, గ్యాస్, అసిడిటీ సమస్యలు, త్రేన్పులు, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు.. నిమ్మ రసం తాగితే చాలా ఉపశమనంగా ఉంటుంది.చాలా మందికి కూడా ఎప్పుడు అలసటగా, నీరసంగా ఉంటుంది. అలా ఉండేవాళ్లకి నిమ్మ రసం తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి.


నిమ్మరసం తక్షణమే ఎనర్జీ లెవల్స్ ను కూడా పెంచుతుంది. శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్‌ను పెంచి.. బ్యాక్టీరియా, ఇన్ ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తుంది. నిమ్మ రసం తరచూ తాగితే.. సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.చర్మానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా నిమ్మకాయ రసంతో చెక్ పెట్టొచ్చు. చాలా రకాల బ్యూటీ ప్రాడెక్ట్స్‌లో నిమ్మకాయను ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మానికి తాజాదనం తీసుకు రావడమే కాకుండా.. చర్మ కాంతిని మెరుగు పరుస్తుంది. విటమిన్ సి.. చర్మ కొల్లాజెన్‌ను బలోపేతం చేసి చర్మాన్ని ఉత్తేజితంగా చేస్తుంది. అయితే నేరుగా ఎప్పుడూ నిమ్మ రసాన్ని చర్మంపై రాయకూడదు.కిచెన్ క్లీనింగ్, ఇంటిని శుభ్రం చేయడంలో కూడా నిమ్మకాయను విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. నిమ్మకాయలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి అనేది ఎక్కువగా లభిస్తుంది. ఇందులో 60 శాతం వరకూ నీరే ఉంటుంది.చాలా మందికి కూడా నిమ్మకాయ నీళ్లు తాగే అలవాటు ఖచ్చితంగా ఉంటుంది. నిమ్మకాయ నీరు తాగడం వల్ల ఖచ్చితంగా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: