మహిళలు ఇంటిని ఎంత బాగా శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ బొద్దింకలు అనేవి చాలా ఎక్కువగా వస్తూనే ఉంటాయి. వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ బొద్దింకలు ఇంట్లో తిరుగుతూ తెగ చికాకాను తెప్పిస్తాయి.ఎటువంటి హాని లేకుండా శాశ్వతంగా బొద్దింకలను వదిలించుకునే టిప్స్ గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.


చాలా మంది కూడా తమ ఇళ్లల్లో సింకుల్లో ఉన్న గిన్నెల తోమకుండా అలాగే వదిలేస్తుంటారు. వాటి వల్ల బొద్దింకలతో పాటు ఇతర కీటకాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలు క్రమం తప్పకుండా ఇంటిని శుభ్రం చేసుకుంటూ డెటాల్ లాంటి వాడితే ఎలాంటి సమస్య ఉండదు.వేపనూనెలోని గుణాలు బొద్దింకలను దూరంగా ఉంచుతాయి. మీరు చేయాల్సిందల్లా వేపనూనెను నీటిలో కలిపి, స్ప్రే బాటిల్‌లో నింపి మీ వంటగదిలోని మూలలో స్ప్రే చేయండి. దీని వల్ల బొద్దింకలు చనిపోతాయి.మీ వంటగదిలోని పగుళ్లలో బోరిక్ యాసిడ్ పొడిని వేయండి. బోరిక్ యాసిడ్ బొద్దింకలకు ప్రాణాంతకం. వెంటనే వాటిని చంపుతుంది.


ఒక చిన్న గిన్నెలో బేకింగ్ సోడా, చక్కెర కలపండి. వంటగదిలోని వివిధ భాగాలలో ఈ మిశ్రమాన్ని స్ప్రే చేయండి. చక్కెర బొద్దింకలను ఆకర్షిస్తుంది. అయితే బేకింగ్ సోడా వాటిని చంపుతుంది. ముందుగా మీరు స్ప్రే బాటిల్‌లో ఒకే మోతాదులో నిమ్మరసం, నీటిని కలపండి. ఈ మిశ్రమాన్ని మీ వంటగది మూలల్లో షెల్ఫ్‌ల కింద, సింక్ చుట్టూ, బొద్దింకలు తిరిగే చోట స్ప్రే చేయండి. బొద్దింకలు నిమ్మకాయ పుల్లని వాసనను ఇష్టపడవు. దీంతో అక్కడ్నుంచి పారిపోతాయి. చాలామంది బొద్దింకలని చంపడానికి మార్కెట్లో దొరికే మందులను వాడుతుంటారు. అయితే అందులో కొన్ని పనిచేస్తే, మరికొన్ని ఏమాత్రం ప్రభావం చూపవు. అంతేకాదు.. ఇంట్లోవాళ్లు అనారోగ్యానికి కూడా గురవుతుంటారు.అయితే ఇలా ఇంట్లోనే ఇలా నేచురల్ గా దొరికే పదార్థాలతో బొద్దింకలకు చాలా ఈజీగా చెక్ పెట్టొచ్చు. ఇక ఎటువంటి హాని లేకుండా శాశ్వతంగా బొద్దింకలను వదిలించుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా పైన తెలిపిన టిప్స్ పాటించండి. ఖచ్చితంగా బొద్దింకలని ఇంట్లో నుంచి తరిమికొట్టండి.

మరింత సమాచారం తెలుసుకోండి: