చాలామంది ప్రజలు ఎక్కువగా మాంసాన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.. మరి కొంతమంది మాంసం లేనిదే ముద్ద దిగదు ఆనెంతగా తింటూ ఉంటారు. అయితే ఇలా మాంసాన్ని తినేవారికి కోలోరెక్టల్ అనే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఇటీవల ఒక అధ్యయనంలో బయటపడింది.. ఈ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను సైతం చాలా ప్రభావితం చేస్తుందని వైద్యులు సైతం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కోలోరెక్టల్ క్యాసర్ వల్ల పెద్ద ప్రేగు జీర్ణ వ్యవస్థ పైన అందులో పని చేసే అవయవాల పైన చాలా ప్రభావం చూపిస్తుందట.


మాంసాహారాన్ని ఎక్కువగా తినడం వల్ల ఈ పెద్ద పేగు క్యాన్సర్ వస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అలాగే అధిక బరువు పెరగడం లేదా ఆల్కహాల్ తాగడం పండ్లు కూరగాయలు తక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల పెద్ద పేగు కాన్సర్ ప్రమాదాన్ని మరింత పెంచుతాయని తెలుపుతున్నారు. ముఖ్యంగా రెడ్ మీట్.. ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలాంటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు.


మాంసాహారాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వండినప్పుడు అవి క్యాన్సర్ కారక రసాయనాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయని ఇటీవలే నిపుణులు పరిశోధనల తేలిందట.. జీవనశైలిలో ధూమపానం మద్యపానం అధిక బరువుకు సైతం దూరంగా ఉండటం వల్ల చాలా మంచిదని దీనివల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్ నుంచి బయటపడవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. పెద్ద పేగు క్యాన్సర్ లక్షణాల విషయానికే వస్తే..


మలవిసర్జన సమయంలో ఎక్కువగా కడుపునొప్పి, రక్తహీనత ,అలసట, బరువు తగ్గడం ,విరేచనాలు వంటివి ఉంటాయంటూ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. అయితే పెద్ద ప్రేగు క్యాన్సర్ లక్షణాలను గుర్తించడం వల్ల వ్యాధిని ముందస్తుగా గుర్తించి చికిత్స చేయించుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదాల నుంచి బయట పడవచ్చు. అందుకే మాంసాహారాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిదని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: