మనలో చాలా మంది కూడా పాదాల పగుళ్ల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.. ముఖ్యంగా ఈ సీజన్లో పాదాల పగుళ్లు అనేవి చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. పాదాలకు ఎంత సంరక్షణ చేసినప్పటికీ కూడా పాదాల పగుళ్లు కొన్ని సందర్భాలలో చాలా ఇబ్బందిగా అసహ్యంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. పాదాల పగుళ్లు దుమ్ము దూళి పేరుకుపోయిన కూడా ఈ సమస్య మరింత ఎక్కువవుతుందని వైద్యుల సైతం తెలియజేస్తున్నారు. అందుకే పాదాల సమస్య చిన్నగా ఉన్నప్పుడే వాటి నుంచి బయటపడే ప్రయత్నాలు చేయాలి.


మార్కెట్లో దొరికేటువంటి క్రీమ్స్ కన్నా కేవలం ఇంటి చిట్కాలను పాటిస్తే వాటి నుంచి కాస్త బయటపడవచ్చు. కాస్త తులసి ఆకులను తీసుకొని శుభ్రంగా వాటిని కడిగి మెత్తని పేస్టులాగా నూరి ఆ పేస్టులో కాస్త కర్పూరం వేసి.. కొంత షాంపూ ని అందులో వేసిన తర్వాత కాస్త అలోవెరా జ్యూస్ కలిపి పాదాలకు పగుళ్లు ఉన్నచోట పట్టించడం వల్ల వాటి నుంచి క్రమంగా మనం తగ్గించవచ్చు. తులసి ,పసుపు ,కర్పూరం అలోవెరా జల్లులో ఉండేటువంటి లక్షణాల వల్ల ఈ పాదాల సమస్యల సైతం మనం తగ్గించుకునేందుకు చాలా ఉపయోగపడుతుంది.


ముఖ్యంగా తడి లేకుండా పాదాలను తుడుచుకున్న తర్వాత మ్యాచ్రైజేషన్ అప్లై చేయడం వల్ల వీటిని తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు ఇలా చేస్తే కచ్చితంగా పాదాల సమస్యలకు సైతం చెక్ పెట్టవచ్చు.

నువ్వుల నూనెతో పాదాలను సైతం మృదువుగా తయారు చేసుకోవచ్చు. కాస్త గోరువెచ్చని నువ్వుల నూనెను రాత్రి పడుకునే ముందు పాదాలు పగిలిన చోట రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


రోజ్ వాటర్ ని గ్లిజరిన్ ని సమానంగా తీసుకొని ఆ మిశ్రమాన్ని కలిపిన తర్వాత పాదాల పగుళ్లపైన అప్లై చేసి గంట సేపు తర్వాత కాస్త గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల పాదాల పగుల నుంచి మంచి ఫలితం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: