ఈ రోజుల్లో అవసరానికి కంటే ఎక్కువగా కాలక్షేపానికే ఫోన్‌ ఉపయోగించే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. అయితే ఈ కాలక్షేపం అనేది కొందరిలో చాలా దరిద్రమైన వ్యసనంగా మారుతోంది. మరీముఖ్యంగా ఇంటర్నెట్ వినియోగం పెరగడం, గేమ్స్‌ ఇంకా సోషల్‌ మీడియా కారణంగా చాలా మంది గంటల తరబడి స్మార్ట్ ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు.అయితే స్మార్ట్ ఫోన్‌ అతి వినియోగం వల్ల చాలా రకాల రకాల సమస్యలు తప్పవని పరిశోధకులు, నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో స్మార్ట్ ఫోన్‌ కారణంగా కంటి సమస్యలు, మానసిక సంబంధిత సమస్యల వరకు వెంటాడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఫిన్‌లాండ్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల్లో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇంటర్నెట్‌, స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్న చిన్నారులు పాఠశాలలకు గైర్హాజరయ్యే అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు.


ముఖ్యంగా తగినంత నిద్ర, వ్యాయామం, తినడం లేకుండా గంటల తరబడి స్మార్ట్‌ ఫోన్‌లతో గడిపే చిన్నారులు స్కూళ్లకు ఎగ్గొడుతున్నారని తాజాగా జరిగిన పరిశోధనల్లో తేలింది. ఇందులో ముఖ్యంగా బాలికలే పరిమితికి మించి ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారని అధ్యయనంలో వెల్లడైంది. అయితే అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిలే చాలా ఎక్కువగా స్కూళ్లకు గైర్హాజరు అవుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. హెల్సింకి వర్సిటీ పరిశోధక బృందం ఇందుకోసం గాను 14 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న 86 వేలకు పైన పిల్లల డేటాను విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చింది.ఈ వివరాలను 'ఆర్కైవ్స్‌ ఆఫ్‌ డిసీజ్‌ ఇన్‌ చైల్డ్‌హుడ్‌' జర్నల్‌లో ప్రచురించడం జరిగింది. ఎక్కువ సమయం ఇంటర్నెట్ వాడే చిన్నారుల్లో 38 శాతం స్కూల్ ఎగ్గొట్టే ప్రమాదం ఉందని, వైద్య సంబంధిత కారణాలతో గైర్హాజరయ్యే ముప్పు 24 శాతం ఉందని ఆ అధ్యయనంలో తేలింది. ఇంకా అదే విధంగా బాలికల్లో 96 శాతం మంది బాలుర కన్నా చాలా ఎక్కువగా ఇంటర్నెట్‌ వాడుతున్నారని పేర్కొంది.కాబట్టి పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఇవ్వకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: