మనం తినేటువంటి కాయగూరలలో బెండకాయ కూడా ఒకటి.. బెండకాయ కర్రీ అన్న, పుల్లగూర అన్న చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. బెండకాయ తినడం వల్ల శరీరానికి కూడా చాలా పోషకాలు అందుతూ ఉంటాయి. ముఖ్యంగా బెండకాయతో ఎలాంటి కర్రీ , వేపుళ్ళు చేసినా కూడా తినడానికి చాలా రుచిగా ఉంటాయి. అయితే చాలామందికి ఇవి తినడానికి ఇబ్బందికరంగా ఎందుకు ఉంటుందంటే జిగట అనేది చాలామందికి నచ్చకపోవచ్చు. కానీ ఈ బెండకాయలలో వచ్చేటువంటి జిగురు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. కూర ఎంత రుచిగా ఉన్నా సరే ఇలా కనిపించడం వల్ల తినడం మానేస్తూ ఉంటారు.


ముఖ్యంగా వేపుళ్ళు చేసేటప్పుడు చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది.. అయితే ఇక మీదట ఆ సమస్య నుంచి బయటపడాలి అంటే మంచి చిట్కాలు తీసుకోవలసి ఉంటుంది.. బెండకాయలను తీసుకునేటప్పుడు కేవలం లేత బెండకాయలను మాత్రమే తీసుకోవాలి.. చిన్న బెండకాయలలో జిగురు అనేది చాలా తక్కువ మొత్తంలో ఉంటుందట. అలాగే వీటిని శుభ్రంగా కూడా కడగాల్సి ఉంటుంది. అలా కడిగిన బెండకాయలను కాసేపు ఆరబెట్టి ఫ్రై వంటిది చేస్తే జిగురు అనేది తగ్గుతూ ఉంటుంది.


బెండకాయలలో జిగురుని సైతం తగ్గించడానికి పెరుగు చాలా చక్కగా పనిచేస్తుంది. బెండకాయల కర్రీ చేస్తున్నప్పుడు కాస్త పెరుగుని అందులోకి వేస్తే జిగురు వెంటనే తగ్గిపోతుంది. లేకపోతే బెండకాయలను కట్ చేసిన తర్వాత పెరుగు నీళ్లతో కడిగిన జిగురు తగ్గిపోతుంది. పెరుగు లేనటువంటివారు బెండకాయ జిగురు తగ్గించాలి అంటే కూర వండేటప్పుడు పైన మూత పెట్టకుండా ఉండడమే మంచిది. ఇలా చేస్తే జిగురు ఎక్కువగా అవుతుంది.. అలాగే బెండకాయ వేపుడు చేసేటప్పుడు కోస్తా శనగపిండి కలపడం వల్ల జిగట కూడా తగ్గిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల బెండకాయలలో వచ్చేటువంటి జిగటను సైతం తగ్గించవచ్చు. ఏది ఏమైనా బెండకాయలలో వచ్చేటువంటి జిగటను సైతం తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: