ఈరోజుల్లో చిన్న వాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఈ జాయింట్ పెయింట్స్ అనేది మరీ ఎక్కువగా వస్తున్నాయి. కండరాళ్లు మరీ ఎక్కువగా నొప్పి వచ్చినప్పుడు కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి. వ్యాయామం డైలీ చేయటం వల్ల మీ బాడీ ఏ పైన్స్ రాకుండా చేస్తుంది. గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోవడం, శారీరక బలహీనత, కాల్షియం లోపం వంటివి ప్రస్తుతం చాలామందిని ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మెడ, నడుము, విన్ను నొప్పికి కారణం అవుతున్నాయి. చలికాలంలో ఈ సమస్య మరింత అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 కొన్నిసార్లు వీటిని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యగా మారవచ్చు. ముఖ్యంగా వెన్నునొప్పి క్రమంగా ప్రమాదకరమైన సయాటికా గా మారుతుంది. ప్రెసెంట్ ఏజ్ తో సంబంధం లేకుండా చాలా మందిని ఇది వేధిస్తుంది. నయాటికా అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? ఎలా నివారించాలో ఇప్పుడు చూద్దాం. తుంటి లోని నుంచి కాళ్ల వరకు వ్యాపించే ఒక రకమైన పెయిన్ ను సయాటికాగా ఆరోగ్యాన్నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల కొందరికి కాళ్లలోని గుంజుతున్నట్లు అనిపిస్తుంది. నరాలపై ఒత్తిడి వల్ల కాళ్లు, నడుము భాగంలో నొప్పి, తిమ్మిరి కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 30 నుంచి 50 ఏండ్ల మధ్య వయసు కలిగిన వారిలో దాదాపు 40 శాతం మంది ఈ సమస్యను ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొంటారని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే వీపు కింద బాగాన ఉండే డిస్క్ లోని ఏదైనా హెర్నియేటెడ్ డిస్క్ జారిపోయిన,

 స్పైనల్ స్టెనోసిస్ ఏర్పడిన నరాల మీద అధిక ఒత్తిడి పెరుగుతుంది. అలాంటప్పుడు బాధితుల్లో నొప్పి తీవ్రత పెరిగి నడవలేని పరిస్థితి తలెత్తవచ్చు. శారీరకంగా ఎక్కువగా కష్టపడే వారికి లేదా ఏజ్ బార్ కారణంగా వెన్ను ముక్కలు మార్పుల వల్ల కూడా సయాటికా సంభవిస్తుందని ఆధ్యాయణాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం యువత కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నది. ఊబకాయం కలిగిన ఉన్న వారిలో, గర్భిణుల్లో, తరచూ ఒకే దగ్గర కూర్చునే వారిలో, అధిక బరువులు ఎత్తే వారిలోనూ మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. వెన్ను, కండరాలు, నరాలపై ఒత్తిడి పెరగడం వల్ల ఇది వస్తుంది. సయాటిక్ నొప్పి వెన్నుపూసలు మొదలై తొడ వెనుక భాగంలో కాళ్ల నుంచి మొదలుకొని అరికాలు వరకు వ్యాపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: