సైలెంట్ గా ఉండే జనాలు చాలా తక్కువగా ఉంటారు. చాలామందికి నిశ్శబ్దం అంటే అసలు గిట్టదు. నిశబ్దాన్ని కొందరు బలహీనతగా భావిస్తుంటారు. మరికొందరు మౌనం అర్ధాంగికారమని అభివర్ణిస్తుంటారు. ఇంకొందరు లోన్లీనెస్ గానూ, బాధాకరమైన పరిస్థితి గానూ చేరుకుంటారు. భావోద్వేగా అణచివేతకు ప్రతిరూపమని చెబుతుంటారు. అయితే అన్ని సిచువేషన్ లకు అవి వర్తించవని, వాస్తవానికి నిశ్శబ్దం మరొక రూపంలో పవర్ ఫుల్ కమ్యూనికేషన్ అని మానసిక నిపుణులు అంటున్నారు. పర్సనల్ లైఫ్ మొదలు కొన్ని ప్రపంచ స్థాయిలో సమస్యలను వరకు నిశబ్దమొక చక్కటి పరిష్కారమని,

దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నిశ్శబ్దాన్ని మనం తరచుగా కుట్ర, బలహీనత, ఎత్తుగడ, బిజీ లైఫ్, పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం, అహంకారం బాధ, భావోద్వేగా అణచివేత వంటి ప్రతికూల అర్థాలకే పరిమితం చేసి చూస్తుంటాం. అయితే మాట్లాడాల్సిన చోట మాట్లాడకపోవడం, చొరవ చూపాల్సిన చోట చూపకపోవడం, ప్రశ్నించాల్సిన చోట ప్రశ్నించకపోవడం వంటి అరుదైన సందర్భాల్లో మినహా చాలావరకు నిశ్శబ్దానికి ఈ భూగోళమంతా విశాలమైన సానుకూలత ఉంటుందంటున్నారు నిపుణులు. అది గుర్తించగలిగినప్పుడు మౌనం మరో మార్గంలో పవర్ఫుల్ కమ్యూనికేషన్ అనేది అర్థమవుతుంది. మౌన వ్రతాలు, కావున పోరాటాలు వంటివి సానుకూల అంశాలుగా పరిగణిస్తున్నప్పుడు, వ్యక్తిగత, వృత్తి జీవితాలకు వచ్చేసరికి దానిని ప్రతికూలతకు ప్రతిరూపంగా చూడటంలో అర్థం లేదంటున్నారు నిపుణులు.

మౌనం వీడితే మంచిదే.... కానీ కొన్ని సందర్భాల్లో విడవకపోతే నే బెటర్. ఎందుకంటే అన్నిచోట్ల అది పనిచేయదు. మనకు ఉపయోగం లేని చోట అనవసరంగా మాట్లాడడం, సమయాన్ని వృధా చేయటం కంటే సైలెన్స్ గా ఉండటమే మంచిది అంటున్నారు నిపుణులు. నిశ్శబ్దమనేది కొన్నిసార్లు నిబద్దకు మారు మాత్రమే కాదు, అది శారీరక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తుంది. సైలెన్స్ గా ఉండే సందర్భం మీలో అధిక రక్తపోటును తగ్గిస్తుందని, రోగనిరోధక శక్తిని, ఏకాగ్రతను పెంచుతుందని పరిశోధనలు సైతం చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: