
హిందూ సాంప్రదాయ ప్రకారం భర్త ఏం చేసినా అది భార్యకి భార్య ఏం చేసినా అది భర్తకు సగం వర్తిస్తుంది. అందుకే పూజలు కూడా భార్య భర్త ఇద్దరు కలిసి చేయాలని భార్య దీపం పెడితే సరిపోదు భర్త కూడా దీపం పెట్టాలి అని అప్పుడే ఆ ఇంటికి కొత్త వెలుగు వస్తుంది అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. కాగా భర్త బయటకు వెళ్తున్న సమయంలో ఎప్పుడూ కూడా భార్య మొహం చీదరించుకొని ఏడుస్తూ ఉండకూడదట. కోపడుతూ రుసరుసలు పడుతూ ఉండకూడదట. సంతోషంగా నవ్వుతూ ఎదురు రావాలి.
అంతేకాదు భర్త కొంచెం డబ్బులు భార్యకి ఇచ్చి భర్త ఏదైనా సమయంలో బయటికి వెళ్ళేటప్పుడు భార్య చేతుల్లో నుంచి ఆ డబ్బుని తీసుకొని వెళ్తే కచ్చితంగా వెళ్ళిన పని సక్సెస్ అవుతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు . అంతేకాదు భర్త బయటకు వెళ్ళేటప్పుడు భార్య చక్కగా అలంకరించుకొని నిండు ముత్తైదువుల బొట్టు పెట్టుకొని చేతినిండా గాజులు వేసుకొని ఎదురొస్తే ఆ పని కచ్చితంగా సక్సెస్ అవుతుందట. చినిగిపోయిన నైటీ వేసుకుని..జుట్టు ముడి వేసుకుని అస్సలు ఎదురు రాకూడదు అంటున్నారు పెద్ద వాళ్లు, ఎప్పుడు కూడా భార్త ముందు భార్య నవ్వుతూనే ఉండాలట . అప్పుడే ఆ భర్త ఆరోగ్యం - ఆయుష్షు- ఆదాయం అన్నీ కూడా పెరుగుతాయట.