జుట్టు ఒత్తుగా, పొడవుగా, ఆరోగ్యంగా పెరగాలనుకుంటున్నారా? అయితే సహజమైన, రసాయనాలులేని మార్గాలను పాటించాలి. నేటి కాలంలో జుట్టు రాలడం, వాలకడం, ఒత్తు తగ్గిపోవడం వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. దీనికి కారణాలు సరైన పోషకాహారం లేకపోవడం, రసాయనాలు కలిగిన షాంపూలు, ఒత్తిడి, నిద్రలేమి వంటి జీవనశైలి సమస్యలే. ఈ సమస్యల్ని నివారించి జుట్టును ఒత్తుగా పెంచేందుకు ఈ చిట్కాలు పాటించండి. ప్రతి వారంలో 2–3 సార్లు జుట్టుకు నూనె మర్దనం చేయాలి. కోకనట్ ఆయిల్, ఆముదం నూనె, బ్రాహ్మి నూనె, బృంగరాజ్ నూనె వంటి సహజ నూనెలను వేడి చేసి మర్దన చేయాలి. నూనె వేడి చేయడం వల్ల తల చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపడి కేశాలు బలంగా పెరుగుతాయి. జుట్టు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి.

 ప్రొటీన్లు: మొలకలు, పచ్చి బఠాణీలు, పాల ప్రాడక్ట్స్, ఐరన్: పాలకూర, బీట్‌రూట్, గుడ్ల, ఓమెగా-3 ఫ్యాటి యాసిడ్స్: వాల్నట్స్, ఫ్లాక్స్సీడ్, చేపలు, విటమిన్ E, C, బయోటిన్: నిమ్మకాయ, సీతాఫలాలు, ఆల్మండ్స్, జుట్టుకు నేచురల్ మాస్కులు వాడండి. మెంతులు + పెరుగు మాస్క్, మెంతులను రాత్రి నానబెట్టి, గ్రైండ్ చేసి పెరుగుతో కలిపి తలకి పట్టించాలి. ఇది జుట్టు రాలడాన్ని ఆపి, కొత్త జుట్టు పెరిగేలా చేస్తుంది. ఆలవెరా జెల్, కొబ్బరి నూనె కలిపి తలకి అప్లై చేసి ఒక గంట వదిలేయాలి. ఇది తల చర్మాన్ని హైడ్రేట్ చేసి, జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టుకి పరబెన్, సల్ఫేట్ లేని షాంపూలు ఉపయోగించండి. స్ట్రెయిటెనింగ్, కలరింగ్ వంటి హీటింగ్ ట్రీట్‌మెంట్‌ లను తగ్గించండి.

వారానికి ఒకసారి తలకి తులసి కషాయం లేదా తలకి సిక్కాకాయి నీటితో తలకడగాలి. సిక్కాకాయి, ఆమ్ల, రీఠా పొడిని కలిపి జుట్టుకి అప్లై చేస్తే జుట్టు పట్టు బాగా ఉంటుంది. తలలో ఉన్న ధూళి, చర్మపు మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. ప్రతి రోజు 5 నిమిషాలు వేళ్ళతో తల మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది జుట్టు ఎదుగుదలకి చాలా బాగా సహాయపడుతుంది. నిద్ర తక్కువగా ఉండటం, మానసిక ఒత్తిడి జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు. రోజుకు కనీసం 7–8 గంటల నిద్ర అవసరం. ధ్యానం, యోగాసనాలు జుట్టు ఆరోగ్యాన్ని ఒత్తిడి తగ్గిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: