
ఆ కారణంగానే చాలామంది ఎక్కువగా మెస్ డోర్స్ లాంటివి పెట్టుకుంటూ ఉంటారు. ఎంత జాగ్రత్తలు తీసుకున్న కొన్ని కొన్ని సార్లు ఆ పురుగులు ఒకటో రెండో ఇళ్లలోకి వచ్చేస్తూ ఉంటాయి. అయితే అలా కూడా రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు . పురుగులు రాకుండా కొన్ని చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది . నిమ్మరసం కలిపి తరచూ ఇల్లలో చల్లడం వల్ల పురుగులు అనేటివి ఇళ్లలోకి అసలు రానే రావు . ఎందుకంటే ఆ వాసన వాటికి నచ్చదు . అంతేకాదు వెనిగర్ ని నీళ్లలో కలిపి కొంచెం కొంచెం గా స్ప్రే చేస్తూ ఉంటే పురుగు రాకుండా ఉంటాయి .
కర్పూరం నీళ్లలో వేసి ఇంటి మూల పెడితే దోమలు పురుగులు అనేటివి అసలు ఇంట్లోకి రానే రావు . అంతే కాదు ఒక చిన్న స్ప్రే తో కూడా అన్ని పురుగులను బొద్దింకలను తరిమికొట్టేయొచ్చట. ఒక పాత్రలో నీటిని గోరువెచ్చగా కాచుకొని .. ఆ నీటిలో లవంగాలు అదే విధంగా నీళ్లు రంగు మారినప్పుడు ఒక చెంచా బేకింగ్ సోడా అదే విధంగా కొంచెం ఉప్పు కలిపి చల్లారాక ..ఆ నీళ్లని స్ప్రే బాటిల్లో జాగ్రత్త పరుచుకొని అప్పుడప్పుడు ఇంటిలో స్ప్రే చేసుకుంటూ ఉంటే అసలు పురుగులే రావు అంటున్నారు పెద్దవాళ్ళు .
అంతేకాదు స్ప్రే సిద్ధంగా ఉంటే బే ఆకులను జోడించి ఇంటి మూల స్ప్రే చేస్తే కీటకాలు దరిదాపుల్లోకి కూడా రావట. అంతేకాదు తరచూ ఇళ్ళు శుభ్రం చేసుకోవడం .. బట్టల చిందరవందరిగా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవడం కూడా చేస్తూ ఉండాలి. తరచుగా ఇల్లు క్లీన్ గా ఉంటే పురుగులు ..బొద్దింకలు ఎక్కువగా గుమ్మి కూడవు.
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సోషల్ మీడియా అదే విధంగా కొంతమంది నిప్పుణులు చెప్పిన ఇంటి చిట్కాలు మాత్రమే అని పాఠకులు గుర్తుంచుకోవాలి. మీరు ఏదైనా ఇంటి చిట్కాలు పాటించేటప్పుడు డాక్టర్ ని సంప్రదించడం తెలిసిన పెద్ద వాళ్ళని కనుక్కోవడం చాలా చాలా ఉత్తమమైనది అని గుర్తుపెట్టుకోండి..!