
మటన్ సూప్ తినడం వలన చలికాలంలో శరీరానికి వేడి కలుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మటన్ బోన్ బ్రోత్ సూప్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కఫం, జలుబు తగ్గించడంలో సహాయపడతాయి. మటన్ ఎముకలలో ఉండే కొల్లాజెన్ వల్ల చర్మం మెత్తగా, యవ్వనంగా మారుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. వేడిగా తీసుకుంటే శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. నెలరోజులపాటు రోజూ మటన్ సూప్ తాగితే వచ్చే సమస్యలు కూడా ఉన్నాయి. మటన్ సూప్‌లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటే బాడీ ఫాట్ పెరగవచ్చు. హార్ట్ సమస్యలు ఉన్నవారికి ప్రమాదం. మటన్‌లో పురిన్లు అధికంగా ఉంటాయి. ఎక్కువగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ పెరిగి, గౌట్ కలగవచ్చు. కొన్ని మటన్ సూప్‌లు ఎక్కువ ఉప్పుతో తయారవుతుంటాయి.
అధిక ఉప్పు వల్ల రక్తపోటు bp పెరిగే అవకాశం. డైబెటిక్ ఉన్నవారు మటన్ తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. రోజూ మటన్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మీద ప్రభావం ఉండవచ్చు. వారానికి 3–4 సార్లు మాత్రమే తాగడం ఉత్తమం. కొవ్వు తక్కువగా ఉన్న మటన్ ఎంచుకోవాలి. ఎముకల మజ్జతో చేసిన క్లియర్ సూప్ అయితే ఇంకా మంచిది. ఉప్పు, నూనె, మసాలాలు తక్కువగా వాడాలి. ఆకుకూరలు, మిరియాల పొడి, అల్లం వంటివి కలిపి తాగితే మరింత మంచిది. నెలరోజులపాటు మటన్ సూప్ తాగడం వల్ల శక్తి, ఎముకల బలం, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కానీ మితిమీరినప్పుడే సమస్యలు వస్తాయి. కొవ్వు, బీపీ, యూరిక్ యాసిడ్ ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.