
*పెరుగు చేపలు కలిపి తినకూడదు . ఇది చాలా మందికి తెలిసిందే . కానీ కొన్ని కొన్ని సార్లు చేపల పులుసు తిన్నప్పుడు కారంగా ఉంది అని ఆ కారాన్ని బ్యాలెన్స్ చేసే దాని కోసం పెరుగన్నం తింటూ ఉంటారు . కొంతమంది చేపలను పెరుగులో నానపెట్టి ఫ్రై చేస్తూ ఉంటారు . ఇది వెరీ వెరీ డేంజర్. వాంతులు అవ్వడం ..మోషన్స్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
*అలాగే చాలామంది అరటి పండుని పెరుగన్నంలో కలుపుకొని తింటూ ఉంటారు . అలా తినకూడదు అంటున్నారు డాక్టర్లు . ఈ రెండు కలిపి తినడం వల్ల కడుపునొప్పి వస్తుందట .
*చాలామంది పెరుగు ఉల్లిపాయలను వేసవి రోజుల్లో తినడానికి ఇష్టపడతారు. ఉల్లిపాయ వేడిగా ఉన్నప్పుడు పెరుగు చల్లగా ఉంటుంది వీటిని కలిపి తినడం వల్ల ఎలర్జీలు గ్యాస్ సమస్యలు వస్తాయట . అందుకే ఈ రెండిటిని కలిపి తినకూడదు అంటున్నారు డాక్టర్లు . పాలు పెరుగు రెండు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీరు పాలు తాగితే పెరుగు తినకండి ..పెరుగు తింటే పాలు తాగకండి .. ఈ రెండు కలిపి అస్సలు తీసుకోకూడదు అంటున్నారు డాక్టర్లు .ఇలా పెరుగు పాలు మిక్స్ చేసి తీసుకోవడం వల్ల గ్యాస్ డయేరియా సమస్యలు వస్తాయట.
*చాలామంది దమ్ బిర్యాని కోసం పెరుగులో చికెన్ ని మ్యారినేట్ చేస్తూ ఉంటారు . కానీ అలా చేయకూడదు అంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పెరుగు చికెన్ కలిపి తిననే తినకూడదట . ఇది కడుపు సంబంధిత వ్యాధులకు దారి తీస్తుందట..!